బాల్య వివాహమా...అయితే టెంట్లు సప్లయి చేయం!
రాజస్థాన్లో పెళ్లిళ్లకు టెంట్లు, సామాగ్రి సప్లయి చేసే వ్యాపార వేత్తలు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. బాల్య వివాహాలకు తాము టెంట్లు ఇవ్వబోమని వారు చెబుతున్నారు. ఇది బాల్య వివాహాలపై ఎక్కువ ప్రభావం చూపకపోయినా తమ వంతుగా వారు తెలుపుతున్న నిరసనను మాత్రం అభినందించాల్సిందే. రాజస్థాన్‌లోని టెంట్ డీలర్ల సంక్షేమ సమితి ఈ నిర్ణయం తీసుకుంది. ఇందులో 9వేలమంది సభ్యులున్నారు. వీరంతా తాము పెళ్లిళ్లకు సామగ్రిని సప్లయి చేయాలంటే తప్పనిసరిగా అమ్మాయి, అబ్బాయిల వయసుని దృవీకరించే బర్త్ […]
రాజస్థాన్లో పెళ్లిళ్లకు టెంట్లు, సామాగ్రి సప్లయి చేసే వ్యాపార వేత్తలు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. బాల్య వివాహాలకు తాము టెంట్లు ఇవ్వబోమని వారు చెబుతున్నారు. ఇది బాల్య వివాహాలపై ఎక్కువ ప్రభావం చూపకపోయినా తమ వంతుగా వారు తెలుపుతున్న నిరసనను మాత్రం అభినందించాల్సిందే.
రాజస్థాన్‌లోని టెంట్ డీలర్ల సంక్షేమ సమితి ఈ నిర్ణయం తీసుకుంది. ఇందులో 9వేలమంది సభ్యులున్నారు. వీరంతా తాము పెళ్లిళ్లకు సామగ్రిని సప్లయి చేయాలంటే తప్పనిసరిగా అమ్మాయి, అబ్బాయిల వయసుని దృవీకరించే బర్త్ సర్టిఫికేట్లు చూపించాలనే నిబంధన పెట్టారు. రాజస్థాన్లో ..బాలికలు పెళ్లి కూతుళ్లు కాదు…అనే పేరుతో బాల్య వివాహాల మీద పోరాటం చేస్తున్న ఓ సేవా సంస్థ అంచనా ప్రకారం అక్కడ అత్యధికంగా 65శాతం బాల్యవివాహాలు జరుగుతున్నాయి. అలాగే ఈ సంఖ్య బీహార్‌లో 70శాతం ఉందని అంచనా. రాజస్థాన్ టెంట్ సప్లయిర్ల సంఘం గత రెండేళ్లలో 80 బాల్య వివాహాలను ఆపగలిగింది. బాల్య వివాహాలు జరుగుతున్నట్టుగా తమ దృష్టికి వస్తే వీరు పోలీసులకు గానీ, ఊరి పెద్ద మనుషులకు గానీ సమాచారం అందిస్తున్నారు.
దక్షిణ ఆసియా మొత్తం మీద 42శాతం పెళ్లికూతుళ్లు పెళ్లి వయసు రానివారే అయివుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న బాల్య వివాహాల్లో మూడింటా ఒక వంతు భారత్‌లోనే జరుగుతున్నాయని యునిసెఫ్ గణాంకాలను బట్టి తెలుస్తోంది.