హైదరాబాద్‌లో గాలి వాన.. పలు ప్రాంతాల్లో విద్యుత్, ఇంటర్ నెట్ సేవలు బంద్
హైదరాబాద్‌లో గత రాత్రి గాలివాన బీభత్సం సృష్టించింది. రాత్రి ఒంటిగంట తర్వాత ఒక్కసారిగా భారీ ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది.నగరంలో చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా ఆగిపోయింది. భారీ వర్షానికి పలు ప్రాంతాలు జలమయమయ్యాయి, అనేక వందల చెట్లు నేల కూలాయి. అనేక ప్రాంతాల్లో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ఇంటర్ నెట్ తో పాటు పలు సేవలకు ఆటంకం ఏర్పడింది. హైదరాబాద్ నగరం నుంచి నడుస్తున్న అనేక వెబ్ సైట్లు కూడా వార్తలను […]
హైదరాబాద్‌లో గత రాత్రి గాలివాన బీభత్సం సృష్టించింది. రాత్రి ఒంటిగంట తర్వాత ఒక్కసారిగా భారీ ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది.నగరంలో చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా ఆగిపోయింది. భారీ వర్షానికి పలు ప్రాంతాలు జలమయమయ్యాయి, అనేక వందల చెట్లు నేల కూలాయి. అనేక ప్రాంతాల్లో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ఇంటర్ నెట్ తో పాటు పలు సేవలకు ఆటంకం ఏర్పడింది. హైదరాబాద్ నగరం నుంచి నడుస్తున్న అనేక వెబ్ సైట్లు కూడా వార్తలను అందించలేకపోయాయి.