పరిటాల శ్రీరామ్ రౌడీ రాజ్యం నడుపుతున్నాడా ?
పరిటాల రవి, రాయలసీమలో ప్యాక్షనిస్టుగా ముద్రపడిన నేత, 2005లో ప్రత్యర్థుల చేతిలో దారుణంగా హత్యకు గురయ్యాడు. ఆ తర్వాత అనంతపురం జిల్లాలో ఫ్యాక్షన్ తగ్గుముఖం పడుతూ వచ్చింది ఇప్పుడు జిల్లాలో ప్రజలు తాగునీటి కోసం, బతుకుదెరువు కోసం పోరాటం చేస్తున్నారు. అయితే జిల్లాలో ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో అప్పుడప్పుడు ఫ్యాక్షన్ భూతం కోమా నుంచి బయటకు వస్తూ పోతూ ఉంది. ఆ మధ్య వైసీపీ నేత భూమిరెడ్డి ప్రసాద్ రెడ్డిని తహసీల్దార్ కార్యాయంలోనే చంపేశారు. ఈ హత్య […]
పరిటాల రవి, రాయలసీమలో ప్యాక్షనిస్టుగా ముద్రపడిన నేత, 2005లో ప్రత్యర్థుల చేతిలో దారుణంగా హత్యకు గురయ్యాడు. ఆ తర్వాత అనంతపురం జిల్లాలో ఫ్యాక్షన్ తగ్గుముఖం పడుతూ వచ్చింది ఇప్పుడు జిల్లాలో ప్రజలు తాగునీటి కోసం, బతుకుదెరువు కోసం పోరాటం చేస్తున్నారు. అయితే జిల్లాలో ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో అప్పుడప్పుడు ఫ్యాక్షన్ భూతం కోమా నుంచి బయటకు వస్తూ పోతూ ఉంది. ఆ మధ్య వైసీపీ నేత భూమిరెడ్డి ప్రసాద్ రెడ్డిని తహసీల్దార్ కార్యాయంలోనే చంపేశారు. ఈ హత్య వెనుక పరిటాల సునీత, ఆమె కుమారుడు పరిటాల శ్రీరామ్ హస్తముందని పెద్దెత్తున ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు తాజాగా మరో వివాదం తలెత్తింది.
హంద్రీనీవా నీటి కోసం జనంలో చైతన్యం తెచ్చేందుకు వైసీపీ రాప్తాడు నియోజకవర్గ ఇన్‌చార్జ్ తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి జలసాధన సమితి చైతన్య యాత్రలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో గురువారం రామగిరి మండలం పోలేపల్లిలో కార్యక్రమం ఏర్పాటు చేశారు . ఈ విషయం తెలుసుకున్న పరిటాల శ్రీరామ్ తన అనుచరులను రంగంలోకి దింపారట. హంద్రీనీవా నీటి కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని అడ్డుకోవాలని అనుచరులను ఆదేశించారని చెబుతున్నారు. దీంతో పరిటాల అనుచరులు ఎన్‌ఎస్ గేటు నుంచి వెంకటాపురం వెళ్లే దారిలో పాపిరెడ్డిపల్లి క్రాస్, పోలేపల్లి క్రాస్, చిగురుచెట్టు కింద, ఎగువపల్లి క్రాస్, సంజీవరాయుని రైస్‌మిల్, శ్రీహరికోట వద్ద గుంపులు గుంపులుగా కట్టెలు, రాళ్లు, మారణాయుధాలు పట్టుకుని రోడ్డుపై మోహరించారని చెబుతున్నారు. హంద్రీనీవా నీటి కార్యక్రమానికి వస్తే చంపేస్తామంటూ హల్ చల్ చేసినట్టు వార్తలొస్తున్నాయి.. ఈ కార్యక్రమానికి వైసీపీ నేతలు ముందే సీఐ దగ్గర అనుమతి తీసుకున్నారట. అయితే డీఎస్పీపై ఒత్తిడి తెచ్చి అనంతరం ఆ అనుమతులను నిలిపివేయించారు.
వైసీపీ నేతలు మాత్రం కార్యక్రమాన్ని తిరిగి నిర్వహించి తీరుతామంటున్నారు. ఈ నేపథ్యంలో రాప్తాడు మండలంలో మరోసారి వాతావరణం వేడెక్కింది. ఇటీవల పరిటాల శ్రీరామ్ తీరుపై పలు ఆరోపణలు కూడా వైసీపీ నేతలు చేస్తున్నారు. ఏదీ ఏమైనా గతం మిగిల్చిన నష్టం నుంచైనా పాఠాలు నేర్చుకుని నేతలు ఫ్యాక్షన్ కు దూరంగా ఉంటే జిల్లాకు మంచి చేసిన వారవుతారు. మరోసారి ఫ్యాక్షన్ భూతం విజృంభిస్తే జిల్లా అభివృద్ధిపైనా తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. చేతనైతే నేతలంతా కలిసి జిల్లాకు కాసిన్ని నీళ్లు సంపాదిస్తే ఆ గడ్డపై పుట్టిన రుణం తీర్చుకున్నా వారవుతారు.
click to read-