Telugu Global
Others

4 వేల ఓట్ల‌ గులాబీ గుబాళిస్తుందా?

పాలేరు ఉప ఎన్నిక‌లో కాంగ్రెస్ మాట‌ల జోరుపెంచింది. కార్య‌క‌ర్త‌లు, అభిమానుల్లో ఉత్సాహం నింపేందుకు టీఆర్ ఎస్‌పై మాట‌ల దాడి ముమ్మ‌రం చేసింది. అన్ని జిల్లాల నాయ‌కులు ఎక్క‌డిక‌క్క‌డ విలేక‌రుల స‌మావేశాలు పెట్టి ఆ పార్టీ తీరును ఎండ‌గడుతున్నారు. టీపీసీసీ అధ్య‌క్షుడు ఉత్త‌మ్ కుమార్ రెడ్డి కూడా కారుపార్టీపై విమ‌ర్శ‌ల జోరు పెంచారు. 2014 ఎన్నికల్లో 4 వేల ఓట్లు కూడా రాని పార్టీ ఇప్పుడెలా పాలేరులో గెలుస్తుంద‌ని ప్ర‌శ్నించారు. అక్క‌డ తెలంగాణ రాష్ట్ర స‌మితికి ఉన్న ఓట్లు […]

4 వేల ఓట్ల‌ గులాబీ గుబాళిస్తుందా?
X
పాలేరు ఉప ఎన్నిక‌లో కాంగ్రెస్ మాట‌ల జోరుపెంచింది. కార్య‌క‌ర్త‌లు, అభిమానుల్లో ఉత్సాహం నింపేందుకు టీఆర్ ఎస్‌పై మాట‌ల దాడి ముమ్మ‌రం చేసింది. అన్ని జిల్లాల నాయ‌కులు ఎక్క‌డిక‌క్క‌డ విలేక‌రుల స‌మావేశాలు పెట్టి ఆ పార్టీ తీరును ఎండ‌గడుతున్నారు. టీపీసీసీ అధ్య‌క్షుడు ఉత్త‌మ్ కుమార్ రెడ్డి కూడా కారుపార్టీపై విమ‌ర్శ‌ల జోరు పెంచారు. 2014 ఎన్నికల్లో 4 వేల ఓట్లు కూడా రాని పార్టీ ఇప్పుడెలా పాలేరులో గెలుస్తుంద‌ని ప్ర‌శ్నించారు. అక్క‌డ తెలంగాణ రాష్ట్ర స‌మితికి ఉన్న ఓట్లు నాలుగంటే నాలుగేవేల‌ని ఉత్త‌మ్ ఎద్దేవా చేస్తురు. కేవ‌లం వీటిని చూసుకుని పాలేరులో పోటీ చేస్తే కారు పార్టీ బొక్క‌బోర్లా ప‌డ‌టం ఖాయ‌మ‌ని విమ‌ర్శించారు. ద‌శాబ్దాల కాలంగా పేద‌ల ప‌క్షాన పోరాడిన రాంరెడ్డి వెంక‌ట‌రెడ్డి అకాల‌మ‌ర‌ణం చెందితే.. ఏక‌గ్రీవానికి స‌హ‌క‌రించ‌కుండా పోటీ చేయ‌డం టీఆర్ ఎస్ అనైతిక‌త‌కు నిద‌ర్శ‌మ‌ని దుయ్య‌బ‌ట్టారు. టీడీపీ, వైసీపీ మాన‌వ‌తాకోణంలో తమ అభ్య‌ర్థుల‌ను పోటీలోకి దింప‌లేద‌ని, కానీ అధికార‌పార్టీ మాత్రం పోటీ పెట్ట‌డం వారి అవ‌కాశ‌వాదానికి నిద‌ర్శ‌న‌మ‌ని ధ్వ‌జ‌మెత్తారు. ఉత్త‌మ్ ఆరోప‌ణ‌ల్లో ఎంతోకొంత వాస్త‌వం లేక‌పోలేదు. గ‌త ఎన్నిక‌ల్లో పాలేరు నుంచి కారు పార్టీ సైతం పోటీ చేసింది. ఆ ఎన్నిక‌ల్లో చాలా స్వ‌ల్ప‌మొత్తంలో ఓట్లను సాధించింది. సూటిగా చెప్పాలంటే… అక్క‌డ పోటీ చేసిన‌ కారు పార్టీ అభ్య‌ర్థి రావెళ్ల ర‌వీంద‌ర్‌కు డిపాజిట్ కూడా ద‌క్క‌లేదు. కాబ‌ట్టి కార్య‌క‌ర్త‌లంతా ఉత్సాహంగా ప‌నిచేస్తే.. గెలుపు పెద్ద క‌ష్టం కాద‌ని ఉత్త‌మ్ కార్య‌ర్త‌ల‌కు మాన‌సిక స్థైర్యం నూరిపోశారు.
2014 పాలేరు ఎన్నిక‌లో వ‌చ్చిన ఓట్ల వివ‌రాలు!
అభ్య‌ర్థి పార్టీ ఓట్లు
రాంరెడ్డి వెంక‌ట రెడ్డి కాంగ్రెస్ 69,707
బేబే స్వ‌ర్ణ‌కుమారి మ‌ద్దినేని టీడీపీ 47,844
పోతినేని సుద‌ర్శ‌న రావు సీపీఎం 44,245
రావెళ్ల ర‌వీంద్ర టీఆర్ ఎస్ 4,041
First Published:  4 May 2016 4:40 AM IST
Next Story