పాలమూరు లొల్లిలో రేవంత్ దారి ఆంధ్రవైపేనా?
పాలమూరు జిల్లాలో ఉన్న ఏకైక టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి. ఓటుకు నోటు కేసులో ప్రధాన నిందితుడిగా.. తెలంగాణ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రయత్నించాడన్న మరక అంటించుకున్న వివాదాస్పద నేత. పాలమూరు ప్రాజెక్టు విషయంలో ఆయన ఇప్పుడు ఎవరికి అనుకూలంగా వ్యవహరిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. కానీ, ఆయన పేరుకు తెలంగాణవాది అయినా.. ఆయన తెలంగాణకు అనుకూలంగా మాట్లాడిన సందర్భాలు తక్కువనే చెప్పాలి. తాజాగా పాలమూరు విషయంలో తన వైఖరి తేటతెల్లం చేయలేదు సరికదా.. ఏపీకే వత్తాసు పలికేలా మాట్లాడుతున్నాడని.. […]
పాలమూరు జిల్లాలో ఉన్న ఏకైక టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి. ఓటుకు నోటు కేసులో ప్రధాన నిందితుడిగా.. తెలంగాణ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రయత్నించాడన్న మరక అంటించుకున్న వివాదాస్పద నేత. పాలమూరు ప్రాజెక్టు విషయంలో ఆయన ఇప్పుడు ఎవరికి అనుకూలంగా వ్యవహరిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. కానీ, ఆయన పేరుకు తెలంగాణవాది అయినా.. ఆయన తెలంగాణకు అనుకూలంగా మాట్లాడిన సందర్భాలు తక్కువనే చెప్పాలి. తాజాగా పాలమూరు విషయంలో తన వైఖరి తేటతెల్లం చేయలేదు సరికదా.. ఏపీకే వత్తాసు పలికేలా మాట్లాడుతున్నాడని.. తెలంగాణవాదులు మండిపడుతున్నారు. సొంత జిల్లా అయిన పాలమూరును సస్యశ్యామలం చేసేందుకు నిర్మించ తలపెట్టిన ప్రాజెక్టు విషయంలో తన వైఖరి ప్రకటించకుండా.. ఇతర పార్టీలపై ఆరోపణలు చేయడాన్ని ఆయన నియోజకవర్గ ప్రజలే తప్పుబడుతున్నారు.
ఆయన ఏపీకే అనుకూలం..!
రేవంత్ పాలమూరు ప్రాజెక్టు విషయంలో తన వైఖరిని స్పష్టం చేయనప్పటికీ తెలంగాణకే వ్యతిరేకంగా మాట్లాడుతూ ఆంధ్రకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని గులాబీనేతలు మండిపడుతున్నారు. కేసీఆర్ – జగన్ పార్టీలు పరస్పర అవగాహన మేరకే పాలమూరుపై మాటల దాడి కొనసాగిస్తున్నాయని ఆరోపించారు. పైగా పాలమూరు ప్రాజెక్టులో 10 వేల కోట్ల రూపాయల పనులను తమ పార్టీలో చేర్చుకున్న వైసీపీ నేతలకు కేసీఆర్ కట్టబెట్టారనే.. వింత వాదన తెరపైకి తీసుకువచ్చారు. దీనిపై గులాబీ – వైసీపీ నేతలు మండిపడుతున్నారు. నాయకుల కొనుగోలు విషయం చంద్రబాబు – రేవంత్‌కు తెలిసినంతగా మాకు తెలియదు కదా! అని ఎగతాళి చేస్తున్నారు. పేదరికం, కరువు తాండవిస్తోన్న జిల్లా అయిన పాలమూరులో పుట్టి, పెరిగిన రేవంత్ ఇలా ఏపీకి అనుకూలంగా వ్యవహరించడాన్ని సొంత జిల్లా వాసులు జీర్ణించుకోలేకపోతున్నారు. సొంత జిల్లా ప్రయోజనాలను తాకట్టు పెట్టేలా ఉన్న ఒంటెద్దు పోకడలు మానుకోవాలని సూచిస్తున్నారు. ఇక కాంగ్రెస్ ప్రాజెక్టు విషయంలో తాము వ్యతిరేకం కాదంటూనే అవినీతి అంశాన్ని ప్రస్తావిస్తోంది. తెలంగాణ టీడీపీకి అగ్రనేతగా ఉంటూ సొంత జిల్లాలో తలపెట్టిన ప్రాజెక్టుకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న రేవంత్‌పై పాలమూరు వాసులు గుర్రుగా ఉన్నారు.