బంతి బాబు కోర్టుకి.... హోదాపై అక్షరరూపంలో కేంద్రం క్లారిటీ
ఆంధ్రపదేశ్ ప్రత్యేక హోదా విషయంలో కేంద్రప్రభుత్వం తమ అభిప్రాయాన్ని మరోసారి కుండబద్దలుకొట్టి చెప్పింది. ఈసారి లిఖితపూర్వకంగానే ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేకహోదా సాధ్యంకాదని తేల్చిచెప్పింది. తెలుగుదేశం పార్టీ అనకాపల్లి ఎంపీ పార్లమెంటులో అడిగిన ప్రశ్నకు ఆర్థికశాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా లిఖితపూర్వకంగా సమాధానం చెప్పారు. ప్రస్తుత నిబంధనల ప్రకారం ఎపీకి ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశమే లేదని,అసలు ప్రత్యేక హోదా అంశం విభజన చట్టంలోనే లేదని తేల్చిచెప్పారు. పునర్విభజన చట్టం ప్రకారం అవసరమైన ఆర్థిక సాయం మాత్రమే చేస్తామని తెలియజేశారు. […]
ఆంధ్రపదేశ్ ప్రత్యేక హోదా విషయంలో కేంద్రప్రభుత్వం తమ అభిప్రాయాన్ని మరోసారి కుండబద్దలుకొట్టి చెప్పింది. ఈసారి లిఖితపూర్వకంగానే ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేకహోదా సాధ్యంకాదని తేల్చిచెప్పింది. తెలుగుదేశం పార్టీ అనకాపల్లి ఎంపీ పార్లమెంటులో అడిగిన ప్రశ్నకు ఆర్థికశాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా లిఖితపూర్వకంగా సమాధానం చెప్పారు. ప్రస్తుత నిబంధనల ప్రకారం ఎపీకి ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశమే లేదని,అసలు ప్రత్యేక హోదా అంశం విభజన చట్టంలోనే లేదని తేల్చిచెప్పారు.
పునర్విభజన చట్టం ప్రకారం అవసరమైన ఆర్థిక సాయం మాత్రమే చేస్తామని తెలియజేశారు. నీతి ఆయోగ్ సిఫార్సులమేరకే నిధులు మంజూరు చేస్తామని మంత్రి లిఖితపూర్వకమైన సమాధానం చెప్పారు. ముసుగులో గుద్దులాట లేకుండా కేంద్రం సమాధానం చెప్పడంతో ప్రత్యేకహోదా అంశంపై కేంద్ర వైఖరి తేటతెల్లమైంది. మంత్రి సమాధానంతో తెలుగుదేశం ఎంపీలు బిక్కమొహం వేశారు.
ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్‌కు మంజూరు చేసిన నిధులను అంకెలతో సహా చెప్పారు కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా. ప్రత్యేక హోదాకోసం పోరాడతాం అంటూ చెబుతూ వచ్చిన చంద్రబాబు ఇప్పుడు కేంద్రం హోదా ప్రసక్తే లేదని తేల్చేసిన నేపధ్యంలో ఇక అటోఇటో తేల్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా విషయంలో కేంద్రం తమ వైఖరి స్పష్టంచేయడంతో, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అంబటి రాంబాబు, వాసిరెడ్డి పద్మ ముఖ్యమంత్రి చంద్రబాబుపై మండిపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ప్రత్యేక హోదా పై తన వైఖరేంటో ఇప్పటికైనా స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. చంద్రబాబుకు చేతకాకపోతే ప్రత్యేకహోదా సాధించే శక్తి తనకు లేదని ప్రజల ముందుకు వచ్చి చెంపలేసుకోవాలని హితవు పలికారు. చంద్రబాబు తనపై ఉన్న కేసులనుంచి తప్పించుకోవటానికి రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టుపెడుతున్నారని మండిపడ్డారు.
ప్రత్యేక హోదా నిర్ణయం నీతి ఆయోగ్ పరిశీలనలో ఉందని చెప్పిన కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, చంద్రబాబు ఇప్పుడు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. ప్రత్యేకహోదా రాకపోవడానికి చంద్రబాబు వైఖరే కారణమని మండిపడ్డారు. చంద్రబాబు, వెంకయ్య ఇద్దరు కలిసి రాష్ట్రప్రజలకు పూటకో మాట చెప్పి మోసం చేశారని, ఇంతకంటే దారుణం ఎక్కడైనా వుంటుందా అని వైసీపీ నాయకులు విరుచుకుపడ్డారు. ఇప్పటికైనా చంద్రబాబు మోల్కొని కేంద్రప్రభుత్వానికి అల్టిమేటం ఇవ్వని పక్షంలో ఆయన ఆడుతున్నది ఒక డ్రామాగా భావించాల్సి వుంటుందన్నారు.
Click on Image to Read: