"నీట్"గా దోచేస్తున్నారు
శవాలమీద పూలు ఏరుకోవడం అంటే ఏమిటో ఆంధ్రప్రదేశ్‌లో కార్పొరేట్ కాలేజీలను చూస్తే అర్థమౌతుంది. ప్రభుత్వం కార్పొరేట్ కాలేజీలకు అమ్ముడుపోవడం అంటే ఏమిటో ఆంధ్రపదేశ్‌ప్రభుత్వాన్ని చూస్తే అర్థమౌతుంది. మెడికల్ కాలేజీల ప్రవేశాలకు “నీట్” నిర్వహించమని సుప్రీంకోర్టు గట్టిగా ఆదేశించాక రెండు సంవత్సరాలనుంచి నిద్రపోతున్న ప్రభుత్వాలు ఇప్పుడు మేల్కొన్నాయి. విద్యార్ధులకు నష్టం జరుగుతుందని సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. వివిధ కారణాలవల్ల సుప్రీంకోర్టుకూడా మెత్తబడింది. బహుశా ఈ ఏడాదికి ఆయా రాష్ట్రప్రభుత్వాలు ఎంట్రెన్సులు నిర్వహించుకోవడానికి సుప్రీంకోర్టు అనుమతించే అవకాశం వుందని చెబుతున్నారు. గురువారంనాడు […]
శవాలమీద పూలు ఏరుకోవడం అంటే ఏమిటో ఆంధ్రప్రదేశ్‌లో కార్పొరేట్ కాలేజీలను చూస్తే అర్థమౌతుంది. ప్రభుత్వం కార్పొరేట్ కాలేజీలకు అమ్ముడుపోవడం అంటే ఏమిటో ఆంధ్రపదేశ్‌ప్రభుత్వాన్ని చూస్తే అర్థమౌతుంది.
మెడికల్ కాలేజీల ప్రవేశాలకు “నీట్” నిర్వహించమని సుప్రీంకోర్టు గట్టిగా ఆదేశించాక రెండు సంవత్సరాలనుంచి నిద్రపోతున్న ప్రభుత్వాలు ఇప్పుడు మేల్కొన్నాయి. విద్యార్ధులకు నష్టం జరుగుతుందని సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. వివిధ కారణాలవల్ల సుప్రీంకోర్టుకూడా మెత్తబడింది. బహుశా ఈ ఏడాదికి ఆయా రాష్ట్రప్రభుత్వాలు ఎంట్రెన్సులు నిర్వహించుకోవడానికి సుప్రీంకోర్టు అనుమతించే అవకాశం వుందని చెబుతున్నారు.
గురువారంనాడు సుప్రీంకోర్టు “నీట్” నిర్వహించే అంశంమీద విచారణ జరుపనుంది. బహుశా తీర్పు ఎప్పుడొస్తుందో తెలీదు. ఎంసెట్ రాసిన, రాయబోతున్న విద్యార్ధులు, వాళ్ల తల్లిదండ్రులు తీర్పు ఎలా వుంటుందోనని చాలా ఆందోళనగా వున్నారు. ఈ విద్యార్ధులనుంచి లక్షలకు లక్షలు ఫీజులు పిండుకున్న కార్పొరేట్ కాలేజీలు మాత్రం విద్యార్ధుల ఆందోళనలో భాగం పంచుకోకపోగా, వాళ్లకు అండగా నిలబడకపోగా మళ్లీ వాళ్లను దోపిడీ చేయడానికి కొత్త మార్గం ఎంచుకున్నాయి.
ఆయా కార్పొరేట్ కాలేజీల్లో చదివిన విద్యార్ధులకు మెసేజ్‌లను పంపుతున్నాయి. “నీట్” పరీక్షకు నెల రోజులపాటు ప్రత్యేక కోచింగ్ ఇస్తామని, దానికి రూ. 50,000ల ఫీజు చెల్లించమని అడుగుతున్నారు, విద్యార్ధులు చేరుతున్నారు.
అసలు నీట్ పరీక్ష జరుగుతుందో లేదో తేలీదు, సుప్రీం కోర్టు ఈ ఏడాదికి ఎంసెట్‌నే ఒప్పుకునే అవకాశమూ వుంది. ఏమీ అర్ధంకాని ఈ పరిస్థితుల్లో, ఇంకా ఏమీ తేలకముందే చైతన్యలాంటి కార్పొరేట్ కాలేజీలు దండుడు మొదలుపెట్టాయి. ఒకవేళ ఈ ఏడాదికి నీట్ రద్దు అయితే ఈ ఫీజులు తిరిగి ఇస్తాయా? కార్పొరేట్ కాలేజీలకు కట్టిన డబ్బు గోడకు కొట్టిన సున్నం తిరిగి వస్తాయా? అయోమయంతో అల్లాడుతున్న విద్యార్ధులను దోచుకుంటున్న తీరు రోజుకు 18 గంటలు ఎండలో పనిచేసే ముఖ్యమంత్రి దృష్టికి రాదా? లేక ఆంధ్రప్రదేశ్ విద్యావ్యవస్థను ఆ రెండు కార్పొరేట్ కాలేజీలకు ధారాదత్తంచేసినట్లే, వాళ్ల దోపిడీకి గేట్లు బార్లా తెరిచినట్లే ఇప్పుడూ వాళ్ల చిలక్కొట్టుడును కూడా ప్రభుత్వం పట్టించుకోదనే తల్లిదండ్రులు భావిస్తున్నారు.
Click on Image to Read: