Telugu Global
NEWS

సాక్షికి డబ్బులిస్తే జగన్ కు వ్యతిరేకంగానూ కథ రాస్తారా?

సాక్షి పత్రికలో ఒక ప్రకటన ఇప్పుడు వైసీపీ అభిమానులకే కోపం తెప్పిస్తోంది. కాసుల కోసం మరీ ఇంతగా దిగజారిపోవాలా అని వాపోతున్నారు.  ఒకవైపు తెలంగాణలో పార్టీ తుడిచిపెట్టుకుపోయిందని వైసీపీ శ్రేణులు బాధపడుతుంటే సాక్షి మాత్రం.. ఆ బాధ నుంచి బాదుకునే ప్రయత్నం చేయడం కాస్త ఆశ్చర్యంగానే ఉంది. తెలంగాణలో వైసీపీ ఖమ్మం జిల్లాలోనే అంతుఇంతో పట్టు ఉండేది. ఖమ్మం ఎంపీగా వైసీపీకే చెందిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గెలిపొందారు. ఆయన కూడా ఇప్పుడు టీఆర్ఎస్ లో చేరిపోయారు. […]

సాక్షికి డబ్బులిస్తే జగన్ కు వ్యతిరేకంగానూ కథ రాస్తారా?
X

13153316_1008411132576837_930611278_nసాక్షి పత్రికలో ఒక ప్రకటన ఇప్పుడు వైసీపీ అభిమానులకే కోపం తెప్పిస్తోంది. కాసుల కోసం మరీ ఇంతగా దిగజారిపోవాలా అని వాపోతున్నారు. ఒకవైపు తెలంగాణలో పార్టీ తుడిచిపెట్టుకుపోయిందని వైసీపీ శ్రేణులు బాధపడుతుంటే సాక్షి మాత్రం.. ఆ బాధ నుంచి బాదుకునే ప్రయత్నం చేయడం కాస్త ఆశ్చర్యంగానే ఉంది. తెలంగాణలో వైసీపీ ఖమ్మం జిల్లాలోనే అంతుఇంతో పట్టు ఉండేది. ఖమ్మం ఎంపీగా వైసీపీకే చెందిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గెలిపొందారు. ఆయన కూడా ఇప్పుడు టీఆర్ఎస్ లో చేరిపోయారు. దీంతో వైసీపీ తెలంగాణపై దాదాపు ఆశలు వదులుకుంది. ఈ బాధలోనే ఉండగానే ఉదయమే సాక్షి పేపర్ చూసిన వైసీపీ అభిమానులకు మరో షాక్ . పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి టీఆర్ఎస్ లో చేరుతున్న సందర్భంగా ఒక యాడ్ ను ప్రముఖంగా సాక్షి తొలిపేజీలో ప్రచురించారు.

వైసీపీ తెలంగాణలో మూతపడుతుంటే అది కూడా సొంత పార్టీ నుంచి ఒక ఎంపీ అక్రమంగా మరో పార్టీలో చేరుతుంటే అది కూడా శుభకార్యం అన్నట్టు సాక్షి ప్రకటన స్వీకరించడం సాక్షి విలువకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది. అంటే వైసీపీ కన్నా, జగన్ కన్నా, నీతినియమాల కన్నా సాక్షికి కాసులే ముఖ్యమైపోయాయన్న మాట. రేపు పొద్దున జగన్ కూడా టీడీపీలో చేరుతున్నట్టుగా ఏ టీడీపీ నాయకుడైనా బాగా డబ్బులు ఇచ్చి ప్రకటన వేయమంటే కూడా సాక్షి వాళ్లు వేసేలాగే ఉన్నారు. నీతులు చెప్పే పత్రికలోనే ఒక నీతిమాలిన పనికి సంబంధించి… అందులోనూ తన యాజమాన్యానికి సంబంధించిన పార్టీకే బొక్కపెట్టే ప్రకటను ప్రముఖంగా ప్రచురించడం నిజంగా వైసీపీ అభిమానులు ఆలోచించుకోవాల్సిన చర్యే. ఒకవేళ సాక్షి వేరు వైసీపీ పార్టీ వేరు అని బుకాయించినా బురిడీ కొట్టడానికి ఎవరులేరులే!.

Click on Image to Read:

YS-Jagan

priyamani

ambati

pawan

IAS-Gorle-Rekha-Rani

pattipati1

madileti

drought

ys-jagan

babu-modi

sv-mohan-reddy-tdp

tdp corporaters

ap-medical-seets-scam

ajay-devagan-chandrababu

srichaitanya

First Published:  4 May 2016 7:12 AM IST
Next Story