డ్యామిట్ కథ అడ్డం తిరిగింది...పనామా పేపర్స్ లో ఏపీ అంబాసిడర్
అజయ్ దేవ్ గన్. ఇటీవల చంద్రబాబును కలిసి ఏపీకి బ్రాండ్ అంబాసిడర్ గా ఉండేందుకు సై అన్న బాలీవుడ్ హీరో. తన భార్య కాజోల్ తో కలిసి ఏపీ బ్రాండ్ ను ఎక్కడికో తీసుకెళ్తామని వచ్చారు. బాబు కూడా సై అన్నారు. అయితే ఇప్పుడు దేవ్ గన్ పనామా పేపర్స్ కు ఎక్కారు. ప్రపంచ వ్యాప్తంగా బ్లాక్ మనీ బాసులకు దడ పుట్టిస్తున్న పనామా జాబితాలో అజయ్ దేవ్ గన్ పేరు చేరడం కలకలం రేపింది. అజయ్ […]
అజయ్ దేవ్ గన్. ఇటీవల చంద్రబాబును కలిసి ఏపీకి బ్రాండ్ అంబాసిడర్ గా ఉండేందుకు సై అన్న బాలీవుడ్ హీరో. తన భార్య కాజోల్ తో కలిసి ఏపీ బ్రాండ్ ను ఎక్కడికో తీసుకెళ్తామని వచ్చారు. బాబు కూడా సై అన్నారు. అయితే ఇప్పుడు దేవ్ గన్ పనామా పేపర్స్ కు ఎక్కారు.
ప్రపంచ వ్యాప్తంగా బ్లాక్ మనీ బాసులకు దడ పుట్టిస్తున్న పనామా జాబితాలో అజయ్ దేవ్ గన్ పేరు చేరడం కలకలం రేపింది. అజయ్ బ్రిటన్ లోని వర్జిన్ ఐలాండ్ కు చెందిన మేరిలిబోన్ ఎంటర్ టైన్ మెంట్ అనే సంస్థలో భారీగా షేర్లు కొన్నట్టు పనామా బయటపెట్టింది. ఈ కంపెనీలో ఆయన భార్య కాజోల్ కూడా ఉన్నారు. ఈ కంపెనీకి అజయ్ 2013లో డైరెక్టర్ గా ఉండి.. 2014లో రాజీనామా చేశారు. అయితే పనామాలో తన పేరు రావడంపై అజయ్ దేవ్ గన్ స్పందించారు. తాము అన్ని నిబంధనల ప్రకారమే చేశామని వెల్లడించారు. అదేంటో…
చంద్రబాబు కొన్ని విషయాల్లో ఏమీ చేసినా బెడిసికొడుతోంది. అప్పట్లో అమెరికా యూనివర్శిటీ డాక్టరేట్ ఇచ్చేందుకు ముందుకు రాగా ఆ యూనివర్శిటీ సాదాసీదా యూనివర్శిటీ అని తెలిసింది. చివరకు జీతాలు ఇవ్వలేక మూతపడింది. ఇప్పుడు ఏపీ బ్రాండ్ పెంచేందుకు అజయ్ దేవ్ గన్ ను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుండగానే ఆయన పనామా జాబితాలోకి ఎక్కిపోయారు. అజయ్ తాను ఎలాంటి తప్పు చేయలేదని బుకాయించినా.. ఒక్కసారి పనామా జాబితాలో పేరు వచ్చిన వారిని ప్రపంచం మోసగాళ్ల తరహాలోనే చూస్తుంది. కాబట్టి అజయ్ దేవ్ గన్ ఇక ఏపీకి అంబాసిడర్ కాకపోవచ్చు.
Click on Image to Read: