కలిసి చావాలని ప్లాన్… తెలివిగా డ్రాప్ అయిన ప్రేయసి, నవ వరుడు మృతి
గుంటూరు జిల్లా ఈపూరులో దారుణం జరిగింది. తనను కాదని మరొక అమ్మాయిని పెళ్లి చేసుకున్నందుకు ప్రియుడిని తెలివిగా చంపేసింది ఒక ప్రియురాలు. ఈపూరుకు చెందిన వెంకటేశ్, అదే గ్రామానికి చెందిన అమ్మాయి చాలా కాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే కొద్ది రోజుల క్రితం విభేదాలు వచ్చి విడిపోయారు. దీంతో వెంకటేశ్ గత శుక్రవారం తన మేనమామ కూతురిని పెళ్లి చేసుకున్నాడు. దీంతో ప్రియురాలు వచ్చి గొడవ పడింది. ఆ మరుసటి రోజు ప్రియురాలికి చెందిన ఇద్దరు సోదరులు వెంకటేశ్ […]
గుంటూరు జిల్లా ఈపూరులో దారుణం జరిగింది. తనను కాదని మరొక అమ్మాయిని పెళ్లి చేసుకున్నందుకు ప్రియుడిని తెలివిగా చంపేసింది ఒక ప్రియురాలు. ఈపూరుకు చెందిన వెంకటేశ్, అదే గ్రామానికి చెందిన అమ్మాయి చాలా కాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే కొద్ది రోజుల క్రితం విభేదాలు వచ్చి విడిపోయారు. దీంతో వెంకటేశ్ గత శుక్రవారం తన మేనమామ కూతురిని పెళ్లి చేసుకున్నాడు. దీంతో ప్రియురాలు వచ్చి గొడవ పడింది. ఆ మరుసటి రోజు ప్రియురాలికి చెందిన ఇద్దరు సోదరులు వెంకటేశ్ దగ్గరకు వచ్చారు.
జరిగిందేదో జరిగిపోయింది మందు కొడుదాం రా అంటూ ఊరి బయటకు వెళ్లారు. అక్కడే ముగ్గురు కలిసి మందు కొట్టారు. కాసేపటి తర్వాత ప్రియురాలు కూడా అక్కడికి వచ్చింది. ఆ సమయంలో మరోసారి ఇద్దరు గొడవ పడ్డారు. కలిసి బతకలేకపోతున్నాం కనీసం కలిసి చచ్చిపోదాం అంటూ వెంకటేశ్ పై ప్రియురాలు ఒత్తిడి తెచ్చింది. దీంతో ఇద్దరూ చావాలని నిర్ణయించుకున్నారు. గ్రామంలో నుంచి పురుగుల మందు తెచ్చుకుని ఇద్దరూ చెరో గ్లాసులో పోసుకున్నారు. తొలుత వెంకటేశ్ పురుగుల మందు తాగేశాడు. వెంకటేష్ విషం తాగిన తర్వాత ప్రియురాలు ప్లేటు ఫిరాయించింది.
”నన్ను మోసం చేసినందుకు నీకు ఇదే శిక్ష. చావు… నేను మాత్రం పురుగుల మందు తాగను, నాకు ప్రభుత్వ ఉద్యోగం కూడా వస్తుంది” అంటూ వెళ్లిపోయింది. దీంతో పురుగుల మందు తాగిన వెంకటేష్ అతి కష్టం మీద ఇంటికి చేరుకుని జరిగిన ఘటనను ఇంట్లో వారికి వివరించాడు. ఆస్పత్రికి తరలించగా అప్పటికే వెంకటేశ్ చనిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ప్రస్తుతం వెంకటేశ్ ప్రియురాలు పరారీలో ఉంది. పెళ్లేయిన 24 గంటలకే భర్తను కోల్పోయిన వెంకటేశ్ భార్య కన్నీటిపర్యంతమవుతోంది.
Click on Image to Read: