ముంచుకొస్తున్నసర్వికల్ క్యాన్సర్ ముప్పు!
భారత మహిళల్లో సర్వికల్ క్యాన్సర్ (గర్భసంచి ముఖద్వారానికి వచ్చే క్యాన్సర్) మళ్లీ విజృంభిస్తోంది. రొమ్ము క్యాన్సర్ మరణాలను ఇది దాటేస్తోందని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చి వెల్లడించింది. ఒక్క 2015లోనే దేశవ్యాప్తంగా 62వేలమంది మహిళలు ఈ వ్యాధితో మరణించారు. ఇది భారత్‌లో మహిళల మొత్తం క్యాన్సర్ మరణాల్లో 24శాతంగా ఉంది. 2008లో సర్వికల్ క్యాన్సర్ తీవ్రత మనదేశంలో చాలా ఎక్కువగా ఉంది. అయితే 2011 క్యాన్సర్ గణాంకాల ఆధారంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ 2012లో ఇచ్చిన […]
భారత మహిళల్లో సర్వికల్ క్యాన్సర్ (గర్భసంచి ముఖద్వారానికి వచ్చే క్యాన్సర్) మళ్లీ విజృంభిస్తోంది. రొమ్ము క్యాన్సర్ మరణాలను ఇది దాటేస్తోందని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చి వెల్లడించింది. ఒక్క 2015లోనే దేశవ్యాప్తంగా 62వేలమంది మహిళలు ఈ వ్యాధితో మరణించారు. ఇది భారత్‌లో మహిళల మొత్తం క్యాన్సర్ మరణాల్లో 24శాతంగా ఉంది. 2008లో సర్వికల్ క్యాన్సర్ తీవ్రత మనదేశంలో చాలా ఎక్కువగా ఉంది. అయితే 2011 క్యాన్సర్ గణాంకాల ఆధారంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ 2012లో ఇచ్చిన నివేదికలో సర్వికల్ క్యాన్సర్ కంటే రొమ్ము క్యాన్సర్ తీవ్రతే బారత మహిళల్లో ఎక్కువగా ఉందని పేర్కొంది.
అయితే ఈ పరిస్థితి మారిపోయి సర్వికల్ క్యాన్సర్ మరణాలు పెరిగిపోయాయని కేంద్ర ఆరోగ్య మంత్రి జెపి నడ్డా రాజ్యసభకు అందించిన వివరాలను బట్టి తెలుస్తోంది. 2013లో రొమ్ము క్యాన్సర్ మరణాలు 40వేలు ఉండగా, 2014లో ఈ సంఖ్య 42వేలకు పెరిగింది. అయితే ఈ సంఖ్యని దాటేసి గత ఏడాది 62వేల మరణాలకు కారణమై సర్వికల్ క్యాన్సర్ భయపెట్టే స్థాయిలో ఉంది. సర్వికల్ క్యాన్సర్‌కి వ్యాక్సిన్ అందుబాటులో ఉన్నా, మనదేశంలో దీని వినియోగం ఇంకా పూర్తి స్థాయిలో లేదు.