చదువుకున్న తల్లులు...తగ్గుతున్న పిల్లలు!
మహిళల్లో విద్య పెరుగుతున్న కొద్దీ వారు పిల్లలను కనడం తగ్గిపోతున్నదని జనాభా లెక్కల వివరాలు చెబుతున్నాయి. శుక్రవారం విడుదలైన 2011జనాభా గణాంకాల ప్రకారం భారతదేశంలో దాదాపు 34 కోట్లమంది వివాహిత మహిళలు ఉన్నారు. వీరు సగటున జన్మనిస్తున్న బిడ్డల సంఖ్య 3.3గా ఉంది. ఈ సంఖ్య 2001లో 3.8 ఉండగా, 1991లో 4.3గా ఉంది. అయితే బిడ్డల సంఖ్య విషయంలో చదువుకున్న తల్లులకు, చదువుకోని తల్లులకు మధ్య చాలా తేడా ఉంది. చదువురాని తల్లులు సగటున కంటున్న […]
మహిళల్లో విద్య పెరుగుతున్న కొద్దీ వారు పిల్లలను కనడం తగ్గిపోతున్నదని జనాభా లెక్కల వివరాలు చెబుతున్నాయి. శుక్రవారం విడుదలైన 2011జనాభా గణాంకాల ప్రకారం భారతదేశంలో దాదాపు 34 కోట్లమంది వివాహిత మహిళలు ఉన్నారు. వీరు సగటున జన్మనిస్తున్న బిడ్డల సంఖ్య 3.3గా ఉంది. ఈ సంఖ్య 2001లో 3.8 ఉండగా, 1991లో 4.3గా ఉంది.
అయితే బిడ్డల సంఖ్య విషయంలో చదువుకున్న తల్లులకు, చదువుకోని తల్లులకు మధ్య చాలా తేడా ఉంది. చదువురాని తల్లులు సగటున కంటున్న పిల్లల సంఖ్య 3.8 ఉండగా, డిగ్రీ ఆపైన చదువుకున్న తల్లులు కంటున్న పిల్లల సంఖ్య సగటున 1.9గా ఉంది. అంటే సగానికి సగం తేడా ఉంది. పిల్లల సంఖ్యని గణనలోని తీసుకోవడానికి 45-49 సంవత్సరాల మధ్య వయసున్న మహిళల పిల్లల సంఖ్యని పరిగణనలోకి తీసుకున్నారు.
ఎనిమిదో తరగతి కంటే తక్కువ చదువుకున్న తల్లులు సగటున ముగ్గురు పిల్లలను కంటున్నారని, హైస్కూలు వరకు చదువుకుని మానేస్తున్న వారు సగటున 2.8 మంది పిల్లలను కంటున్నట్టుగా, పదినుండి గ్రాడ్యుయేషన్ వరకు చదువుతున్నవారు సగటున 2.3 మంది పిల్లలకు జన్మనిస్తున్నారని తేలింది. ఈ క్రమంలో గ్రాడ్యుయేషన్ దాటిన మహిళలు కంటున్న పిల్లల సగటు 1.9గా ఉంది.