ఏపీలో మరో భారీ కుంభకోణం బట్టబయలు
ఏపీలో మరో భారీ కుంభకోణం వెలుగు చూసింది. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ ఆధ్వర్యంలో జరిగిన మెడికల్ కౌన్సిలింగ్ లో దిగ్బ్రాంతి కలిగించే అంశాలు బయటపడ్డాయి. కోర్టులను సైతం తప్పుదారి పట్టిస్తూ మెడికల్ సీట్లు అమ్మేసుకున్నారు. దాదాపు 100 సీట్లను అమ్మేసుకున్నారు. కర్నూలు జిల్లాకు చెందిన రమణ అనే వ్యక్తి ఈ కుంభకోణాన్ని బట్టబయలు చేశారు. ఆర్టీఐ చట్టం కింద వివరాలు సేకరించారు. సీబీఐకి ఫిర్యాదు వెళ్లింది. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా విజిలెన్స్ విభాగం కూడా రంగంలోకి […]
ఏపీలో మరో భారీ కుంభకోణం వెలుగు చూసింది. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ ఆధ్వర్యంలో జరిగిన మెడికల్ కౌన్సిలింగ్ లో దిగ్బ్రాంతి కలిగించే అంశాలు బయటపడ్డాయి. కోర్టులను సైతం తప్పుదారి పట్టిస్తూ మెడికల్ సీట్లు అమ్మేసుకున్నారు. దాదాపు 100 సీట్లను అమ్మేసుకున్నారు. కర్నూలు జిల్లాకు చెందిన రమణ అనే వ్యక్తి ఈ కుంభకోణాన్ని బట్టబయలు చేశారు.
ఆర్టీఐ చట్టం కింద వివరాలు సేకరించారు. సీబీఐకి ఫిర్యాదు వెళ్లింది. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా విజిలెన్స్ విభాగం కూడా రంగంలోకి దిగింది. రమణ నుంచి ఆధారాలు తీసుకునేందుకు లేఖ రాసింది. కర్నూలు మెడికల్ కాలేజ్, పద్మావతి వర్శిటీల్లో లోకల్ విద్యార్థులకు దక్కాల్సిన సీట్లను నాన్ లోకల్ విద్యార్థులకు అమ్ముకున్నట్టుగా తేలింది. సీట్లను కోట్లాది రూపాయలకు అమ్ముకున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. 2015 మెడికల్ కౌన్సిలింగ్ లో ఈ అక్రమాలు జరిగాయి.
సీట్లను ముందే బ్లాక్ చేయడం, లోకల్ వారికి దక్కాల్సిన సీట్లను నాన్ లోకల్ వారికి అమ్ముకోవడం, పేద విద్యార్థులను మోసం చేసి డబ్బుకు పెద్దపీట వేయడం, ఎన్ఆర్ఐ సీట్లు వేలం వేయడం, ఇలా రకరకాలుగా మోసాలకు తెగబడ్డారు. కోర్టు పరిధిలో ఉన్న సీట్లను కూడా రహస్యంగా భర్తీ చేశారు. అయితే కోర్టులకు మాత్రం అంతా సవ్యంగా ఉన్నట్టు తప్పుడు అఫిడవిట్లు సమర్పించారు.
తనకు ఎంసీఐ నుంచి కూడా లేఖ అందిందని, అక్రమంగా సీట్లు పొందిన వారి సంగతి తేలుస్తామని ఫిర్యాదుదారుడు రమణ చెబుతున్నారు. మెరిట్ విద్యార్థులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామంటున్నారు. చాలా దుర్మార్గంగా విజయవాడ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ కౌన్సిలింగ్ నిర్వహించిందని రమణ ఆవేదన చెందారు. లోకల్ విద్యార్థులు దారుణంగా నష్టపోయారని అన్నారు. అయితే ఈ కుంభకోణంపై చర్యలు ఉంటాయో లేదో చూడాలి.