కబాలీ సూట్లు... వనితల క్రియేటివిటీ!
కబాలీలో రజనీకాంత్ స్టైల్‌కి తగినట్టుగా దుస్తులను డిజైన్ చేసిన వ్యక్తి హీబా సయిత్ అనే మహిళ. చైన్నైలోని ఖరీదైన మెన్స్‌వేర్ బ్రాండ్ అలిఫ్…వీరిదే. కబాలీకి క్యాస్టూమ్ డిజైనర్‌గా ఉన్న అను వర్దన్, హీబాని, ఆమె భర్త ఒమర్ సయిత్‌ని కలవగా హీబా, అను వర్దన్‌తో కలిసి పనిచేసింది. అలా.. రజనీ స్టయిల్‌ని ఇనుమడింపచేసిన దుస్తులను ఇద్దరు మహిళలు కలిసి అందించారు. అనువర్దన్, బిల్లా, ఆరంభం చిత్రాలకోసం అజిత్‌కి దుస్తులను డిజైన్ చేశారు. రజనీకాంత్‌కి కబాలీలో ఒక పవర్‌ఫుల్ […]
కబాలీలో రజనీకాంత్ స్టైల్‌కి తగినట్టుగా దుస్తులను డిజైన్ చేసిన వ్యక్తి హీబా సయిత్ అనే మహిళ. చైన్నైలోని ఖరీదైన మెన్స్‌వేర్ బ్రాండ్ అలిఫ్…వీరిదే. కబాలీకి క్యాస్టూమ్ డిజైనర్‌గా ఉన్న అను వర్దన్, హీబాని, ఆమె భర్త ఒమర్ సయిత్‌ని కలవగా హీబా, అను వర్దన్‌తో కలిసి పనిచేసింది. అలా.. రజనీ స్టయిల్‌ని ఇనుమడింపచేసిన దుస్తులను ఇద్దరు మహిళలు కలిసి అందించారు. అనువర్దన్, బిల్లా, ఆరంభం చిత్రాలకోసం అజిత్‌కి దుస్తులను డిజైన్ చేశారు. రజనీకాంత్‌కి కబాలీలో ఒక పవర్‌ఫుల్ లుక్‌ని ఇచ్చే ప్రయత్నం చేశామని హీబా అంటోంది. ప్రతిదీ కొత్తగా ప్రత్యేకంగా ఉండేలా ప్రయత్నించామని ఆమె అంది.
ఇప్పటివరకు రజనీ కాంత్ వివిధ సినిమాల్లో ధరించిన దుస్తులను దృష్టిలో పెట్టుకుని తెరమీద కొత్తలుక్‌ని తెచ్చేందుకు ప్రయత్నించామని, రజనీకాంత్ సూట్‌కి వాడిన క్లాత్ తయారీలో జనపనార ఫినిషింగ్ ఉందని, ఇటలీలోని సొంత యూనిట్‌లో వాటిని తయారు చేయించామని ఆమె తెలిపింది. ఆయన స్కిన్ టోన్‌కి, ధైర్యాన్ని ప్రతిబింబించే తీరుకి ఖాకీలాంటి రంగులు సూటవుతాయని భావించామని, గళ్లు చారల డిజైన్లను కూడా ఎంపికచేశామని హీబా చెప్పింది. రజనీ దుస్తుల విషయంలో ప్రతిదీ చేతులతోనే రూపొందించారు. రజనీకాంత్ ఫస్ట్ లుక్ పోస్టర్ లో గ్లాస్ వాల్ గదిలో కౌలాలంపూర్ బ్యాంగ్రౌండ్‌లో కనబడతారు. అందులో ఆయన ధరించిన సూట్, హీబా బృందం డిజైన్ చేసిందే. వీరు డిజైన్ చేసిన ఆరు సూట్లలో అదీ ఒకటి. రజనీకాంత్ చాలా సింపుల్‌గా నిరాడంబరంగా ఉంటారని, ఆయన తమతో, తన దుస్తులు సౌకర్యవంతంగా ఉంటే చాలని అన్నారని హీబా చెప్పింది. అదీ ఎక్కువ సమయం వాటిలో ఉండాలి కనుక… అలా చెప్పారని ఇక మిగిలిన విషయాల్లో పూర్తి స్వేచ్ఛని ఇచ్చారని హీబా తెలిపింది. రజనీకాంత్‌కి దుస్తుల విషయంలో టెక్నికల్ నాలెడ్జి చాలా ఉందని, ఆయన తన క్యాస్టూమ్స్‌ని ఫైనల్ చేసేముందు కొన్ని రకాల ఫైటింగ్స్, శరీర కదలికలకు అనుకూలంగా ఉన్నాయాలేదా అనేది చూసుకున్నారని ఆమె చెప్పింది.