Telugu Global
Cinema & Entertainment

పెళ్లి పుకార్లను ఖండించిన హాట్ హీరోయిన్

సినిమాలు లేకపోయినా…. ఓ భారీ పుకారుతో ఈమధ్య సెంటరాఫ్ ఎట్రాక్షన్ గా నిలిచింది హీరోయిన్ పూనమ్ బజ్వా. టాలీవుడ్ కు చెందిన సునీల్ రెడ్డి అనే దర్శకుడితో పూనమ్ బజ్వా ప్రేమలో ఉందని… వాళ్లిద్దరూ ఈమధ్యే రహస్యంగా పెళ్లి కూడా చేసుకున్నారని వార్తలు వచ్చాయి. వార్తలు వచ్చిన ఇన్నాళ్లకు పూనమ్ బజ్వా వెలుగులోకివ చ్చింది. వాటిపై స్పష్టత ఇచ్చింది. తను ఎవర్నీ పెళ్లి చేసుకోలేదని క్లారిటీ ఇచ్చింది. ఈ మధ్య తన సోదరి పెళ్లి చేసుకుందని… తన […]

పెళ్లి పుకార్లను ఖండించిన హాట్ హీరోయిన్
X
సినిమాలు లేకపోయినా…. ఓ భారీ పుకారుతో ఈమధ్య సెంటరాఫ్ ఎట్రాక్షన్ గా నిలిచింది హీరోయిన్ పూనమ్ బజ్వా. టాలీవుడ్ కు చెందిన సునీల్ రెడ్డి అనే దర్శకుడితో పూనమ్ బజ్వా ప్రేమలో ఉందని… వాళ్లిద్దరూ ఈమధ్యే రహస్యంగా పెళ్లి కూడా చేసుకున్నారని వార్తలు వచ్చాయి. వార్తలు వచ్చిన ఇన్నాళ్లకు పూనమ్ బజ్వా వెలుగులోకివ చ్చింది. వాటిపై స్పష్టత ఇచ్చింది. తను ఎవర్నీ పెళ్లి చేసుకోలేదని క్లారిటీ ఇచ్చింది. ఈ మధ్య తన సోదరి పెళ్లి చేసుకుందని… తన సోదరి పెళ్లిని తన పెళ్లిగా భావించి వార్తలు రాసేశారని పూనమ్ బజ్వా ఆందోళన వ్యక్తంచేసింది. తను అస్సలు ఎవర్నీ ప్రేమించడం లేదని కూడా తెలిపింది. తను పెళ్లి చేసుకుంటే పత్రికల ద్వారా ఆ విషయాన్ని వెల్లడిస్తానని చెప్పిన పూనమ్ బజ్వా… ఇకపై తనకు సంబంధించిన వార్తలు రాసేముందు తనను సంప్రదించాలని కోరింది. అయితే పూనమ్ బజ్వా సుదీర్ఘంగా స్పష్టత ఇచ్చినప్పటికీ రూమర్ మాత్రం అలానే కంటిన్యూ అవుతోంది. బజ్వా ఖండించినప్పటికీ పెళ్లి మాత్రం అయిపోయిందనే అంటున్నారు చాలామంది. కేవలం సినిమా అవకాశాలు తగ్గిపోతాయనే కారణంతోనే పెళ్లి విషయాన్ని సీక్రెట్ గా ఉంచుతున్నారని తెలుస్తోంది. గతంలో కామ్న జెఠ్మలాని కూడా ఇలానే చేసింది. కేవలం సినిమా ఆఫర్ల కోసమే పెళ్లయిన విషయాన్ని చాలారోజులు సీక్రెట్ గా ఉంచింది.
First Published:  3 May 2016 4:19 AM IST
Next Story