కేసీఆర్ దత్తపుత్రిక ప్రత్యూషను పెళ్లి చేసుకుంటా " మద్దిలేటి రెడ్డి
తండ్రి, సవతి తల్లి చేతిలో చిత్రహింసలకు గురైన ప్రత్యూష ఇప్పుడు పెళ్లి వైపు మొగ్గుచూపుతోంది. చిత్రహింసలకు గురైన ప్రత్యూషను చూసి చలించిపోయిన కేసీఆర్ అప్పట్లో ఈమెను దత్తత తీసుకున్నారు. చదువుతో పాటు పెళ్లి చేసే బాధ్యత కూడా తనదేనని ప్రకటించారు. ప్రస్తుతం శిశుసంక్షేమ శాఖ హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్న ప్రత్యూష పెళ్లి తర్వాత చదువు కొనసాగిస్తానని… తాను ప్రేమించిన వ్యక్తితో పెళ్లి చేయాలని కోరుతోంది. ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే ఆమెను పెళ్లికి పురికొల్పిన అంశాల్లో ప్రధానమైంది శిశుసంక్షేమ […]
తండ్రి, సవతి తల్లి చేతిలో చిత్రహింసలకు గురైన ప్రత్యూష ఇప్పుడు పెళ్లి వైపు మొగ్గుచూపుతోంది. చిత్రహింసలకు గురైన ప్రత్యూషను చూసి చలించిపోయిన కేసీఆర్ అప్పట్లో ఈమెను దత్తత తీసుకున్నారు. చదువుతో పాటు పెళ్లి చేసే బాధ్యత కూడా తనదేనని ప్రకటించారు. ప్రస్తుతం శిశుసంక్షేమ శాఖ హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్న ప్రత్యూష పెళ్లి తర్వాత చదువు కొనసాగిస్తానని… తాను ప్రేమించిన వ్యక్తితో పెళ్లి చేయాలని కోరుతోంది. ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే ఆమెను పెళ్లికి పురికొల్పిన అంశాల్లో ప్రధానమైంది శిశుసంక్షేమ హాస్టల్లో తిండి కూడా. ప్రభుత్వ హాస్టళ్లలో తిండి ఎంత భయంకరంగా వుంటుందో ఆ బాధలు అనుభవించినవాళ్లకే తెలుసు. అందుకే ప్రత్యూష ఈ తిండి తినలేకపోతున్నానని, ఈ హాస్టల్ నుంచి బయటపడి పెళ్లి చేసుకున్నాక చదువును కొనసాగిస్తానని చెబుతోంది. ఈ విషయాన్ని అధికారులు సీఎం కేసీఆర్ దృష్టికి కూడా తీసుకెళ్లారు. పోలీసుల ద్వారా ప్రేమికుడి వివరాలు రాబట్టారు. మూడు రోజుల క్రితం జాతీయ పత్రికలోనూ ప్రముఖంగా ఈ విషయం ప్రచురితమైంది.
ప్రత్యూష ప్రేమించిన వ్యక్తి పేరు మద్దిలేటి రెడ్డి. ఇతడిది కర్నూలు జిల్లా ఆళగడ్డ. స్థానికంగా ఓ ఆటోమొబైల్ షాపులో పనిచేస్తున్నాడు. ఇతడు బీఎస్సీ పూర్తి చేశాడు. గతంలో గాయాలతో ప్రత్యూష గ్లోబల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలోనే తన స్నేహితుడిని పరామర్శించేందుకు మద్దిలేటి రెడ్డి ఆస్పత్రికి వచ్చారు. ఆ సమయంలోనే ప్రత్యూష, మద్దిలేటి రెడ్డి మధ్య స్నేహం చిగురించింది. ఫోన్ నెంబర్ ఇచ్చాడు. ఏ ఇబ్బంది వచ్చినా తనకు ఫోన్ చేయాలని ఆమెకు చెప్పి వెళ్లాడు. అప్పటి నుంచి రెగ్యులర్ గా టచ్ లో ఉంటున్నారు. ఇప్పుడు పెళ్లి వరకు వ్యవహారం వెళ్లింది. ప్రత్యూష ఇటీవలే ఇంటర్ వొకేషనల్ పరీక్ష సైతం పాసైయ్యారు. బీఎస్సీ నర్సింగ్ కూడా చేస్తానని చెబుతూ వచ్చింది.
నేను పేదవాడినే… మాట తప్పే వాడిని కాదు – మద్దిలేటి రెడ్డి
ప్రత్యూషను ప్రేమించిన మాట వాస్తవమేనని మద్దిలేటి రెడ్డి చెప్పారు. పెళ్లి చేసుకుంటానని వెల్లడించాడు. తాను పేదవాడినే కానీ మాట తప్పే వాడిని, మోసం చేసే వాడిని కాదంటున్నాడు మద్దిలేటి రెడ్డి. తన తల్లి కూడా పెళ్లికి అంగీకరించిందని చెప్పాడు. కోర్టు, ప్రభుత్వ పెద్దలు అంగీకరిస్తే అందరి సమక్షంలోనే పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. మరి పెళ్లికి కోర్టుతో పాటు కేసీఆర్ ఎలా స్పందిస్తారో చూడాలి. గతంలో ప్రత్యూషకు జరిగిన అన్యాయంపై హైకోర్టు సుమోటోగా స్పందించింది. దీంతో ఆమె వ్యవహారాలను కోర్టుకు కూడా తెలియజేయాల్సి వచ్చింది. ఇప్పటికే కోర్టుకు ఈ విషయం తెలియజేయగా కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చినట్టు తెలుస్తోంది.
Click on Image to Read: