అప్పుడున్న ఉత్సాహం ఇప్పుడేమైంది వెంకయ్య...
నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో ఉండే వీహెచ్ మరోసారి తన మాటల దాడిని కొనసాగించారు. ఈసారి తెలంగాణ సమస్యపై కాకుండా పొరుగు రాష్ర్టం ఏపీ సమస్యపై మాట్లాడటం విశేషం. ఏపీ సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి వెంకయ్య, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ లపై విరుచుకుపడ్డారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకహోదా.. రావాలంటే తెలుగుదేశం పార్టీ కేంద్రంలో పొత్తు నుంచి వైదొలగాలని సూచించారు. లేఖలు రాస్తే హోదాలు రావని, ఇవన్నీ తూతూ మంత్రపు చర్యలేనని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి సైతం […]
నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో ఉండే వీహెచ్ మరోసారి తన మాటల దాడిని కొనసాగించారు. ఈసారి తెలంగాణ సమస్యపై కాకుండా పొరుగు రాష్ర్టం ఏపీ సమస్యపై మాట్లాడటం విశేషం. ఏపీ సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి వెంకయ్య, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ లపై విరుచుకుపడ్డారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకహోదా.. రావాలంటే తెలుగుదేశం పార్టీ కేంద్రంలో పొత్తు నుంచి వైదొలగాలని సూచించారు. లేఖలు రాస్తే హోదాలు రావని, ఇవన్నీ తూతూ మంత్రపు చర్యలేనని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి సైతం హితబోధ చేశారు. ముందు మీరు ఎన్‌డీఏ ప్రభుత్వం నుంచి తప్పుకోండి.. హోదా దానంతట అదే నడుచుకుంటూ వస్తుందని తేల్చిచెప్పారు. హోదా కోసం కేంద్రంపై టీడీపీ ఇలా మెతగ్గా వ్యవహరిస్తే.. సరిపోదని సూచించారు. రాష్ట్ర విభజన సందర్భంగా రాజ్యసభలో తెలంగాణ విభజన బిల్లు చర్చకు వచ్చినపుడు వెంకయ్యనాయుడు చాలా మాట్లాడారని, ఆయనలో అప్పుడు ఉన్న ఉత్సాహం ఇప్పుడు ఏమైపోయిందని ప్రశ్నించారు. కేంద్రం మంత్రి అయిన వెంకయ్య నాయుడి మౌనానికి కారణం ఏంటని నిలదీశారు. ట్విట్టర్‌లో కూతలు కూసే పవన్ కల్యాణ్ కాంగ్రెస్‌పై అనవసర వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని సూచించారు. రాజకీయంగా అనవసరపు వ్యాఖ్యలు చేసి పలుచన కావొద్దని హితవు పలికారు. మొత్తానికి హనుమంతన్న ఏపీ నేతలందరినీ ఒకేసారి ఎందుకు ఉతికి ఆరేశాడో తెలుసా? ప్రత్యేకహోదా విషయంలో ఈ ముగ్గురూ కాంగ్రెస్‌ను విమర్శిస్తున్నారు.. ఎంతైనా హనుమంతుడు కదా! అందుకే అందరికీ హితబోధ చేశాడు.