Telugu Global
Cinema & Entertainment

క‌బాలి .. బాక్సాఫీస్ గ‌ర్జ‌నే...!

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ సినిమా రిలీజ్ అవుతుంది అంటే బ‌య‌ర్లు సేఫ్ లో ఉంటారు. కానీ ఆయన ఈ మ‌ధ్య చేసిన రెండు చిత్రాలు కొచ్చాడియ‌న్, లింగ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర డిజాస్ట‌ర్స్ గా నిలిచాయి. బ‌య‌ర్లు ర‌జ‌నీకాంత్ ను త‌మ న‌ష్టాన్ని కొంత స‌రిచేయ‌మ‌ని వేడుకునే వ‌ర‌కు వ‌చ్చింది. అభిమానులు కూడా తీవ్ర నిరాశ‌కు గుర‌య్యారు. క‌ట్ చేస్తే ఈ సారి ర‌జనీకాంత్ ఏ విధ‌మైన ప్ర‌యోగాలు చేయ‌కుండా.. ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ ఫార్మేట్ చిత్రంతో విజ‌య గ‌ర్జ‌న‌కు […]

క‌బాలి .. బాక్సాఫీస్ గ‌ర్జ‌నే...!
X

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ సినిమా రిలీజ్ అవుతుంది అంటే బ‌య‌ర్లు సేఫ్ లో ఉంటారు. కానీ ఆయన ఈ మ‌ధ్య చేసిన రెండు చిత్రాలు కొచ్చాడియ‌న్, లింగ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర డిజాస్ట‌ర్స్ గా నిలిచాయి. బ‌య‌ర్లు ర‌జ‌నీకాంత్ ను త‌మ న‌ష్టాన్ని కొంత స‌రిచేయ‌మ‌ని వేడుకునే వ‌ర‌కు వ‌చ్చింది. అభిమానులు కూడా తీవ్ర నిరాశ‌కు గుర‌య్యారు.

క‌ట్ చేస్తే ఈ సారి ర‌జనీకాంత్ ఏ విధ‌మైన ప్ర‌యోగాలు చేయ‌కుండా.. ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ ఫార్మేట్ చిత్రంతో విజ‌య గ‌ర్జ‌న‌కు సిద్ద‌మ‌య్యారినిపించేలా క‌బాలి సినిమా టీజ‌ర్ ఉంది. ద‌ర్శ‌కుడు పారంచింత్ చేసిన ఈ చిత్రంలో ర‌జ‌నీ గెట‌ప్, డైలాగ్.. ఒక్క‌టేమిటి అన్ని అభిమానుల‌కు కావ‌ల‌సిన విధంగా తీర్చి దిద్దిన‌ట్లు క‌నిపిస్తుంది. క‌బాలీ టీజర్ విడుద‌లై 24 గంట‌లు గ‌డిచిందో లేదో గానీ.. సోష‌ల్ నెట్ వ‌ర్క్ లో ఇప్ప‌టికే 50 ల‌క్ష‌ల వ్యూస్ దాటింది. ఇది ఒక రికార్డు అనే చెప్పాలి. కబాలి చిత్రంలో ర‌జ‌నీకాంత్ స‌ర‌స‌న రాధిక ఆప్టే న‌టిస్తుంది. మొత్తం మీద క‌బాలి చిత్రంలో ర‌జ‌నీకాంత్ ఎంత‌గా చేల‌రేగ‌నున్నాడో నిన్న విడుద‌లైన టీజ‌ర్ లో ఆయ‌న చెప్పిన డైలాగ్ ను బ‌ట్టి అర్ధం అవుతుంది. స్క్రీన్ ప్లే కొద్దిగ ఆసక్తిగా ఉంటే క‌బాలి బాక్సాఫీస్ రికార్డ్స్ ను షేక్ చేయ‌డం ఖాయంగా క‌నిపిస్తుంది.

First Published:  2 May 2016 9:59 AM IST
Next Story