వర్శిటీలోనే కండువాలు కప్పిన చంద్రబాబు
యూనివర్శిటీల్లో టీడీపీ రాజకీయాలు మరోసారి వివాదాస్పదం అవుతున్నాయి. పవిత్రమైన వర్శిటీలను టీడీపీ నేతలు రాజకీయ వేదికలుగా మార్చడంపై విమర్శలు వస్తున్నాయి. ఏకంగా ముఖ్యమంత్రి చంద్రబాబే ఆ చర్యలో పాల్గొనడంపై విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శనివారం విశాఖలోని ఆంధ్రా యూనివర్శిటీలో నీరు- ప్రగతి కార్యక్రమం ఏర్పాటు చేశారు. అంతవరకు బాగానే ఉంది. కానీ కార్యక్రమం ముగియగానే వర్శిటీ అసెంబ్లీ హాల్లోనే పార్టీ చేరికలకు శ్రీకారం చుట్టారు. పార్టీ మారుతున్న వారికి వర్శిటీ హాల్లోనే కండువాలు కప్పారు. […]
యూనివర్శిటీల్లో టీడీపీ రాజకీయాలు మరోసారి వివాదాస్పదం అవుతున్నాయి. పవిత్రమైన వర్శిటీలను టీడీపీ నేతలు రాజకీయ వేదికలుగా మార్చడంపై విమర్శలు వస్తున్నాయి. ఏకంగా ముఖ్యమంత్రి చంద్రబాబే ఆ చర్యలో పాల్గొనడంపై విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
శనివారం విశాఖలోని ఆంధ్రా యూనివర్శిటీలో నీరు- ప్రగతి కార్యక్రమం ఏర్పాటు చేశారు. అంతవరకు బాగానే ఉంది. కానీ కార్యక్రమం ముగియగానే వర్శిటీ అసెంబ్లీ హాల్లోనే పార్టీ చేరికలకు శ్రీకారం చుట్టారు. పార్టీ మారుతున్న వారికి వర్శిటీ హాల్లోనే కండువాలు కప్పారు. పార్టీలో చేరిన వారు కూడా ఘనులే. తెలుగు రాష్ట్రాల్లో 36లక్షల మంది ఖాతాదారులను ముంచేసిన అగ్రిగోల్డ్ మాజీ వైస్ చైర్మన్ రామ్మోహనరావు, ఇటీవల వ్యభిచారం కేసులో అరెస్ట్ అయిన కోరాడ రాజబాబు కూడా వర్శిటీ వేదికగా చంద్రబాబు చేతుల మీదుగా టీడీపీ కండువా కప్పుకున్న వారిలో ఉన్నారు.
గతంలోనూ యూనివర్శిటీ అధికారులు, టీడీపీ అనుబంధ విద్యార్థి సంఘం కలిసి లోకేష్, చంద్రబాబు పుట్టిన రోజు వేడుకలను నిర్వహించారు. అప్పట్లో ఈ వ్యవహారం దుమారం రేపింది. ఎలాంటి పదవిలో లేని లోకేష్ పుట్టిన రోజును వర్శిటీ అధికారులు క్యాంపస్‌లో ఎలా నిర్వహిస్తారని మిగిలిన విద్యార్థి సంఘాలు ప్రశ్నించాయి. టీడీపీ అధికారం చేపట్టిన మొదట్లో ఆంధ్రావర్శిటీ సెనేట్ హాల్లోనే టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం కూడా నిర్వహించారు.
Click on Image to Read: