ఏపీ టీడీపీ కోటాలో ఎంపీగా వెంకయ్య!
చంద్రబాబు నాయుడికి ఆప్తమిత్రుడు, టీడీపీకి దీర్ఘకాల మిత్రుడు అయిన కేంద్రమంత్రి వెంకయ్యనాయుడి చింత తీరింది. లాబీయింగ్‌లో తిరుగులేని నేతగా పేరు సంపాదించిన వెంకయ్య మూడోసారి ఎంపీగా ఏపీ నుంచి ఎంపిక కానున్నట్లు సమాచారం. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్న వెంకయ్య పదవీకాలం వచ్చేనెలతో తీరిపోనుంది. బీజేపీ నిబంధనల ప్రకారం.. పార్టీ సభ్యులకు రెండు పర్యాయాలకు మించి ఎంపీ టికెట్ ఇవ్వకూడదు. ఇప్పటికే పార్టీ వెంకయ్యను రెండుసార్లు ఎంపీగా నామినేట్ చేసింది. ప్రస్తుతం ఆయన కర్ణాటక నుంచి ఎంపీగా […]
BY sarvi1 May 2016 5:36 AM IST
X
sarvi Updated On: 2 May 2016 6:02 AM IST
చంద్రబాబు నాయుడికి ఆప్తమిత్రుడు, టీడీపీకి దీర్ఘకాల మిత్రుడు అయిన కేంద్రమంత్రి వెంకయ్యనాయుడి చింత తీరింది. లాబీయింగ్‌లో తిరుగులేని నేతగా పేరు సంపాదించిన వెంకయ్య మూడోసారి ఎంపీగా ఏపీ నుంచి ఎంపిక కానున్నట్లు సమాచారం. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్న వెంకయ్య పదవీకాలం వచ్చేనెలతో తీరిపోనుంది. బీజేపీ నిబంధనల ప్రకారం.. పార్టీ సభ్యులకు రెండు పర్యాయాలకు మించి ఎంపీ టికెట్ ఇవ్వకూడదు. ఇప్పటికే పార్టీ వెంకయ్యను రెండుసార్లు ఎంపీగా నామినేట్ చేసింది. ప్రస్తుతం ఆయన కర్ణాటక నుంచి ఎంపీగా నామినేట్ అయ్యారన్న సంగతి తెలిసిందే. ఎంపీగా ఆయన పదవీకాలం ముగియబోతుండటం, కేంద్రంలో మంత్రిగా ఉండటంతో ఆయన పదవి విషయం ఏమవుతుందా..? అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. ఈ నేపథ్యంలో ఆయన్ను ఏపీ సీఎం చంద్రబాబు ఆదుకోనున్నారని సమాచారం.
ఎలా పంపుతారు?
2014 ఎన్నికల్లో ఏపీ అసెంబ్లీలో 107 స్థానాలు గెలుచుకుంది టీడీపీ. రాజ్యసభకు ఎంపీని నామినేట్ చేయాలంటే.. కనీసం 36 స్థానాలు కావాలి. అంటే.. టీడీపీ ఇప్పటికిప్పుడు ఇద్దరు ఎంపీలను రాజ్యసభకు పంపగలదు. ఏపీలో టీడీపీతో కలిసి పోటీ చేసిన బీజేపీ 4 స్థానాలు గెలుచుకుంది. వెంకయ్య ఎంపీ కావాలంటే..36 మంది ఎమ్మెల్యేలు ఆయనకు మద్దతుగా నిలవాలి. ఏపీ సీఎం వెంకయ్యను రాజ్యసభకు పంపాలంటే.. చంద్రబాబుకు పెద్ద విషయం కాదు. ఏపీకి ప్రత్యేక హోదాతోపాటు.. రాజధాని నిర్మాణం, కేంద్రం సాయం కావాలంటే.. నరేంద్ర మోదీ ప్రభుత్వంలో బలమైన లాబీయింగ్ ఉండాలి. సుజనా చౌదరి ఇప్పటికే టీడీపీ ఎంపీగా ఉన్నారు. ఆయన పదవీకాలం కూడా జూన్‌తో ముగిసిపోనుంది. ఆయన్ను రెండోసారి నామినేట్ చేసేది అనుమానమే. ఇప్పటికే కేంద్రమంత్రిగా, నరేంద్రమోదీని సైతం ప్రభావితం చేయగల వ్యక్తిని తమ రాష్ట్రం నుంచి ఎంపీగా నామినేట్ చేస్తే.. కేంద్రంలో మరోసారి చక్రం తిప్పవచ్చని బాబు ఆలోచనగా తెలుస్తోంది. అందుకే, వెంకయ్యకు టీడీపీ ఎమ్మెల్యేలతో మద్దతు ఇప్పించి ఎంపీగా నామినేట్ చేయాలని చూస్తున్నారని విశ్వసనీయ సమాచారం.
Next Story