రాజ్యసభకు వెళ్లే గులాబీలు ఎవరు?
రాజ్యసభ ఎన్నికల నగారా మోగింది. తాజాగా నోటిఫికేషన్ కూడా విడుదలైంది. నామినేషన్ల గడువు 31 వరకు ఉంది. దీంతో రాజ్యసభకు వెళ్లాలన్న ఆశావహులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. కేసీఆర్ ను ప్రసన్నం చేసుకునేందుకు ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. వీరిలో అందరికంటే ముందు నమస్తే తెలంగాణ పాత యజమాని సీఎల్ రాజం ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణ ఆవిర్భావం తరువాత బీజేపీ తీర్థం పుచ్చుకున్న సీఎల్ రాజం ఇప్పటికీ బీజేపీలోనే ఉన్నారు. ఆయనకు రాజ్యసభ సీటుదాదాపుగా ఖాయం […]
రాజ్యసభ ఎన్నికల నగారా మోగింది. తాజాగా నోటిఫికేషన్ కూడా విడుదలైంది. నామినేషన్ల గడువు 31 వరకు ఉంది. దీంతో రాజ్యసభకు వెళ్లాలన్న ఆశావహులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. కేసీఆర్ ను ప్రసన్నం చేసుకునేందుకు ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. వీరిలో అందరికంటే ముందు నమస్తే తెలంగాణ పాత యజమాని సీఎల్ రాజం ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణ ఆవిర్భావం తరువాత బీజేపీ తీర్థం పుచ్చుకున్న సీఎల్ రాజం ఇప్పటికీ బీజేపీలోనే ఉన్నారు. ఆయనకు రాజ్యసభ సీటుదాదాపుగా ఖాయం అవుతుందని ఆయన వర్గీయులు విశ్వాసంగా ఉన్నారు. బీజేపీలో కొనసాగుతున్న నేతకు టీఆర్ ఎస్ టికెట్ ఎలా ఇస్తారన్నది ఇప్పుడు చర్చానీయాంశంగా మారింది. ఆయన బీజేపీకి రాజీనామా చేస్తారా? గులాబీకండువా కప్పుకుంటారా ? లేకుంటే బీజేపీలో ఉండగానే కారు పార్టీ టికెట్ ఇస్తుందా? రాజంను బీజేపీలోనే ఉంచి రాజ్యసభ టికెట్ ఇవ్వడం ద్వారా కేంద్రంతో సఖ్యత పెంచుకునే దూరదృష్టి లేకపోలేదని పలువురు విశ్లేషిస్తున్నారు. కేసీఆర్ అమ్ముల పొదిలో ఇలాంటి అస్ర్తాలు ఎన్నో ఉన్నాయని.. రాజం టికెట్ ఇచ్చినా ఆశ్చర్యం పోనవసరం లేదని సొంత పార్టీ నేతలే అంటున్నారు.
కెప్టెన్ ను తప్పిస్తారా?
ఇక పార్టీ కోశాధికారికిగా పని చేసిన దామోదర్ రావు, టీడీపీ నుంచి టీఆర్ ఎస్‌లో చేరిన తేరా చిన్నపరెడ్డి సైతం ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. ఇక మాజీ కాంగ్రెస్ నేత డీఎస్ కూడా రాజ్యసభ ఆశావహుల రేసులో ముందు నుంచి ఉన్న సంగతి తెలిసిందే! వారి తరువాత కేసీఆర్ వర్గీయుడు, ఆప్తుడు అయిన కెప్టెన్ లక్ష్మీకాంతరావు కూడా టికెట్ కోసం పోటీ పడుతున్నాడు. ఈసారికి కెప్టెన్ కు లభించే అవకాశాలు తక్కవఅనే చెప్పాలి. పార్టీలో అతనికి ఇస్తున్న ప్రాధాన్యం దృష్టా ఈసారికి పోటీ నుంచి తప్పించనున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఆయన్ను బ్రాహ్మణ పరిషత్ కు చైర్మన్‌గా పంపుతారన్న ప్రచారం సాగుతోంది. దీనికి కారణం లేకపోలేదు. కెప్టెన్, రాజం ఇద్దరూ బ్రాహ్మణులే. రెండు టికెట్లు ఓసీలకే ఇస్తే.. ప్రజల్లో వ్యతిరేకత వస్తుందన్న భయం కేసీఆర్‌లోనూ ఉంది. అందుకే రెండు టికెట్లలో ఒకటి ఓసీకి, మరోటి బీసీకి ఇస్తారని అనుకుంటున్నారు.