నేను కాదు... పెద్దిరెడ్డే రూ. 700 కోట్ల కాంట్రాక్టు తీసుకున్నారు
తనను అనవసరంగా విమర్శించి గెలకవద్దని సీనియర్ నేత మైసూరారెడ్డి వైసీపీని హెచ్చరించారు. అలా చేస్తే లేనిపోని రహస్యాలు బయటపెట్టాల్సి ఉంటుందన్నారు. పుట్టలోకి వేలు పెడితేనే చీమ కుడుతుందన్న విషయం గుర్తుపెట్టుకోవాలన్నారు. నాలుగేళ్ల పాటు వైసీపీ కోసం కష్టపడ్డానని తానేమైనా జీతగాడినా అని మైసూరా ప్రశ్నించారు. తనకు జగనే ఈ విషయంలో రుణపడి ఉన్నారని చెప్పారు. కాంట్రాక్టుల కోసమే వైసీపీని వీడారంటూ పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డి చేసిన విమర్శలను ప్రస్తావించగా.. తాను ఒక్క కాంట్రాక్టు కూడా తీసుకోలేదని చెప్పారు. […]
తనను అనవసరంగా విమర్శించి గెలకవద్దని సీనియర్ నేత మైసూరారెడ్డి వైసీపీని హెచ్చరించారు. అలా చేస్తే లేనిపోని రహస్యాలు బయటపెట్టాల్సి ఉంటుందన్నారు. పుట్టలోకి వేలు పెడితేనే చీమ కుడుతుందన్న విషయం గుర్తుపెట్టుకోవాలన్నారు. నాలుగేళ్ల పాటు వైసీపీ కోసం కష్టపడ్డానని తానేమైనా జీతగాడినా అని మైసూరా ప్రశ్నించారు.
తనకు జగనే ఈ విషయంలో రుణపడి ఉన్నారని చెప్పారు. కాంట్రాక్టుల కోసమే వైసీపీని వీడారంటూ పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డి చేసిన విమర్శలను ప్రస్తావించగా.. తాను ఒక్క కాంట్రాక్టు కూడా తీసుకోలేదని చెప్పారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డే జగన్ తో ఫోన్ చేయించి పక్క రాష్ట్రంలో రూ. 700 కోట్ల విలువైన కాంట్రాక్టు సొంతం చేసుకున్నారని మైసూరారెడ్డి ఆరోపించారు.
పెద్దిరెడ్డి తనకు మంచి మిత్రుడని అనవసరమైన ఆరోపణలు చేయవద్దన్నారు. విశాఖపట్నం సదస్సులో సిమెంట్ ఫ్యాక్టరీకి సంబంధించి చేసుకున్న ఎంఓయూను ప్రభుత్వం పక్కనపెట్టడం వల్లే టీడీపీలో చేరానని చెప్పడంలో నిజం లేదన్నారు. సిమెంట్ ఫ్యాక్టరీకి అవసరమైన భూమిని ప్రభుత్వం ఇస్తే తీసుకుంటామని లేకుంటే కొనుక్కుంటామని చెప్పారు. ఇప్పటి వరకు తానెప్పుడూ చంద్రబాబును విమర్శించలేదని చెప్పారు.
Click on Image to Read: