ఆయన నాకు వద్దు... నాకు కావాలి...
బాలకృష్ణ వందో సినిమాకు సంబంధించిన విచిత్ర పరిస్థితి ఇది. క్రిష్ దర్శకత్వంలో బాలయ్య చేయబోతున్న వందో సినిమా గౌతమీపుత్ర శాతకర్ణి కోసం మొదట నయనతారను సంప్రదించారు. అయితే యమ బిజీగా ఉన్న నయన్… బాలయ్య సరసన నటించేందుకు ఒప్పుకోలేదు. ఇప్పటికే కమిటైన సినిమాలతో దూసుకుపోతోంది. దీంతో మేకర్స్ కాజల్ ను సంప్రదించారు. యువరాణిలా కనిపించడంలో పండిపోయిన కాజల్…. గౌతమీపుత్ర శాతకర్ణిలో చేయడం పెద్ద సమస్యేం కాదు. కాల్షీట్లు కూడా ఖాళీగానే ఉన్నాయి. కానీ బాలయ్య సరసన కనిపించడమే […]
BY sarvi1 May 2016 4:38 AM IST

X
sarvi Updated On: 1 May 2016 9:24 AM IST
బాలకృష్ణ వందో సినిమాకు సంబంధించిన విచిత్ర పరిస్థితి ఇది. క్రిష్ దర్శకత్వంలో బాలయ్య చేయబోతున్న వందో సినిమా గౌతమీపుత్ర శాతకర్ణి కోసం మొదట నయనతారను సంప్రదించారు. అయితే యమ బిజీగా ఉన్న నయన్… బాలయ్య సరసన నటించేందుకు ఒప్పుకోలేదు. ఇప్పటికే కమిటైన సినిమాలతో దూసుకుపోతోంది. దీంతో మేకర్స్ కాజల్ ను సంప్రదించారు. యువరాణిలా కనిపించడంలో పండిపోయిన కాజల్…. గౌతమీపుత్ర శాతకర్ణిలో చేయడం పెద్ద సమస్యేం కాదు. కాల్షీట్లు కూడా ఖాళీగానే ఉన్నాయి. కానీ బాలయ్య సరసన కనిపించడమే ఆమెకు ఇబ్బందిగా మారింది. దీంతో కాజల్ కూడా గౌతమీపుత్ర శాతకర్ణి ప్రాజెక్టుకు నో చెప్పినట్టు తెలుస్తోంది. అయితే మేకర్స్ మాత్రం ఆమెను ఎలాగైనా ఒప్పించాలనుకంటున్నారు. మరోవైపు ఇలియానా మాత్రం తనకు ఆఫర్ వస్తే బాలయ్య సరసన నటిస్తానంటోంది. అవసరమైతే రెమ్యూనరేషన్ లో డిస్కౌంట్ కూడా ఇస్తానంటోంది. ఓ వైపు కాజల్ పొమ్మంటుంటే… ఇలియానా మాత్రం రమ్మంటోంది. మేకర్స్ మాత్రం కాజల్ వెంట పడుతున్నారు. గోవా బ్యూటీని చూడ్డం లేదు.
Next Story