మోడీ చదువు వివరాలు...కేజ్రీవాల్‌కి చెప్పండి!
ప్రధాని నరేంద్ర మోడీ పొందిన డిగ్రీ, పిజి పట్టాలకు సంబంధించిన సమాచారాన్ని, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కి అందించాల్సిందిగా కేంద్ర సమాచార కమిషన్ ఢిల్లీ యూనివర్శిటీకి, గుజరాత్ యూనివర్శిటీకి సూచనలు జారీ చేసింది. అంతేకాదు, ఆయన డిగ్రీలు సాధించిన రోల్ నెంబర్లను, సంవత్సరాలను రెండు యూనివర్శిటీలకు అందించాల్సిందిగా సమాచార శాఖ కమిషనర్ ఎమ్ శ్రీధర్ ఆచార్యులు ప్రధాన మంత్రి కార్యాలయాన్ని కోరారు. ఆ వివరాలు లేకుండా విద్యార్థుల రికార్డులను పరిశీలించడం కష్టమని ఆ రెండు యూనివర్శిటీలు తెలిపి […]
ప్రధాని నరేంద్ర మోడీ పొందిన డిగ్రీ, పిజి పట్టాలకు సంబంధించిన సమాచారాన్ని, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కి అందించాల్సిందిగా కేంద్ర సమాచార కమిషన్ ఢిల్లీ యూనివర్శిటీకి, గుజరాత్ యూనివర్శిటీకి సూచనలు జారీ చేసింది. అంతేకాదు, ఆయన డిగ్రీలు సాధించిన రోల్ నెంబర్లను, సంవత్సరాలను రెండు యూనివర్శిటీలకు అందించాల్సిందిగా సమాచార శాఖ కమిషనర్ ఎమ్ శ్రీధర్ ఆచార్యులు ప్రధాన మంత్రి కార్యాలయాన్ని కోరారు. ఆ వివరాలు లేకుండా విద్యార్థుల రికార్డులను పరిశీలించడం కష్టమని ఆ రెండు యూనివర్శిటీలు తెలిపి ఉండటంతో ఆచార్యులు, ప్రధాన మంత్రి ఆఫీస్‌కి ఈ మేరకు సూచనలు చేశారు. భారత ప్రజాస్వామ్యంలో ఎన్నికల్లో పోటీ చేయడానికి ఎలాంటి డిగ్రీ అవసరం లేకపోయినా ఢిల్లీ ముఖ్యమంత్రి కోరటం వల్లనే ఈ సమాచారాన్ని వెల్లడిస్తున్నామని ఆచార్యులు తెలిపారు.
అంతకుముందు సమాచార శాఖ కమిషన్, 1978వ సంవత్సరంలో డిగ్రీ, 1983లో పిజి చేసిన వారి పేర్లను పరిశీలించాలని ఢిల్లీ , గుజరాత్ యూనివర్శిటీలను కోరింది, అయితే కాలేజికి హాజరు కాకుండా ప్రయివేటుగా చదివి డిగ్రీని పొందే విద్యార్థులు లక్షలమంది ఉన్న నేపథ్యంలో రోల్ నెంబరు లేకుండా ఒక విద్యార్థి ని గురించి వెతకడం కష్టమని ఢిల్లీ యూనివర్శిటీ పేర్కొంది. ఈ నేపథ్యంలో కేంద్ర సమాచార శాఖ కమిషనర్, తగిన సమాచారాన్ని యూనివర్శిటీలకు పంపాల్సిందిగా ప్రధానమంత్రి కార్యాలయాన్ని కోరారు.
Click on Image to Read: