జగన్‌ను కలిస్తే తప్పేంటి?.. ఫ్లాష్ బ్యాక్ గుర్తు చేసి ప్రశ్నించిన మాణిక్యాలరావు
సేవ్ డెమొక్రసి పేరుతో ఢిల్లీలో కేంద్రమంత్రులను జగన్ కలవడంపై టీడీపీ నేతలు భగ్గుమంటున్నారు. కేసుల్లో నిందితుడిగా ఉన్న జగన్‌కు కేంద్రమంత్రులు ఎలా అపాయింట్‌మెంట్ ఇస్తారని సీనియర్ మంత్రి, శాసనసభవ్యవహారాల శాఖమంత్రి యనమల రామకృష్ణుడు ప్రశ్నించారు. కేంద్రమంత్రుల తీరు సరికాదని హితవు చెప్పారు. అయితే యనమల, టీడీపీ నేతలు విమర్శలకు బీజేపీ ఏపీ మంత్రి మాణిక్యాలరావు గట్టిగానే సమాధానం చెప్పారు. ఏపీ ప్రతిపక్ష నేతగా కేంద్రమంత్రులను కలిసే హక్కు జగన్‌కు ఉందని మాణిక్యాలరావు అన్నారు. కేంద్రమంత్రులను కలిసే హక్కు […]
సేవ్ డెమొక్రసి పేరుతో ఢిల్లీలో కేంద్రమంత్రులను జగన్ కలవడంపై టీడీపీ నేతలు భగ్గుమంటున్నారు. కేసుల్లో నిందితుడిగా ఉన్న జగన్‌కు కేంద్రమంత్రులు ఎలా అపాయింట్‌మెంట్ ఇస్తారని సీనియర్ మంత్రి, శాసనసభవ్యవహారాల శాఖమంత్రి యనమల రామకృష్ణుడు ప్రశ్నించారు. కేంద్రమంత్రుల తీరు సరికాదని హితవు చెప్పారు. అయితే యనమల, టీడీపీ నేతలు విమర్శలకు బీజేపీ ఏపీ మంత్రి మాణిక్యాలరావు గట్టిగానే సమాధానం చెప్పారు.
ఏపీ ప్రతిపక్ష నేతగా కేంద్రమంత్రులను కలిసే హక్కు జగన్‌కు ఉందని మాణిక్యాలరావు అన్నారు. కేంద్రమంత్రులను కలిసే హక్కు జగన్‌కు లేదంటున్న టీడీపీ నేతలు… మరి అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి జగన్‌కు ఆహ్వానించేందుకు ఏకంగా ఇద్దరు మంత్రులను ఆయన ఇంటికి ఎందుకు పంపారని మాణిక్యాల రావు ప్రశ్నించారు. కామినేని, చింతకాయల అయన్నపాత్రుడు జగన్ ను ఆహ్వానించేందుకు వెళ్లలేదా అని ప్రశ్నించారు. వైసీపీ ఎమ్మెల్యేలను టీడీపీలో చేర్చుకోవడం టీడీపీ విజ్ఞతకు సంబంధించిన అంశం అని పరోక్షంగా తప్పుపట్టారు.
Click on Image to Read: