కర్నూలులో జగన్ మూడు రోజుల నిరాహార దీక్ష
జగన్ మరోసారి నిరాహారదీక్షకు సిద్ధమయ్యారు. కృష్టా డెల్టాను ఎడారి చేసేలా ఎగువ రాష్ట్రాలు ప్రాజెక్టులు కడుతున్నా చంద్రబాబు అడ్డుకోవడం లేదని… ఇందుకు నిరసగా మే 16, 17, 18 కర్నూలులో నిరాహార దీక్ష చేస్తున్నట్టు జగన్ ప్రకటించారు. రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం చంద్రబాబుతో పాటు, కేంద్రానికి కూడా తెలియాలన్నారు. పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా 115 టీఎంసీల నీటిని తెలంగాణ ప్రభుత్వం మళ్లిస్తుంటే చంద్రబాబు ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. 854 అడుగుల మేర శ్రీశైలం ప్రాజెక్టులో నీరు ఉంటేనే రాయలసీమకు […]
జగన్ మరోసారి నిరాహారదీక్షకు సిద్ధమయ్యారు. కృష్టా డెల్టాను ఎడారి చేసేలా ఎగువ రాష్ట్రాలు ప్రాజెక్టులు కడుతున్నా చంద్రబాబు అడ్డుకోవడం లేదని… ఇందుకు నిరసగా మే 16, 17, 18 కర్నూలులో నిరాహార దీక్ష చేస్తున్నట్టు జగన్ ప్రకటించారు. రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం చంద్రబాబుతో పాటు, కేంద్రానికి కూడా తెలియాలన్నారు.
పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా 115 టీఎంసీల నీటిని తెలంగాణ ప్రభుత్వం మళ్లిస్తుంటే చంద్రబాబు ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. 854 అడుగుల మేర శ్రీశైలం ప్రాజెక్టులో నీరు ఉంటేనే రాయలసీమకు నీరు అందుతాయన్నారు. కానీ ప్రస్తుతం శ్రీశైలంలో 780 అడుగులకు నీటి మట్టం తీసుకెళ్లారని అన్నారు. 780 అడుగుల నుంచి 854 అడుగులకు శ్రీశైలంలో నీరు చేరేదెప్పుడు రాయలసీమకు నీరు అందెదెప్పుడు అని జగన్ ప్రశ్నించారు.
నీటిని ఎగువ రాష్ట్రాలు ఇష్టానుసారం మళ్లిస్తే రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాల ప్రజలు ఎలా బతకాలని ప్రశ్నించారు. ఈ విషయాలు తెలిసి కూడా ఓటుకు నోటు కేసుకు భయపడి చంద్రబాబు నోరు విప్పడం లేదని జగన్ మండిపడ్డారు. ఎగువన కడుతున్న ప్రాజెక్టు వల్ల నాగార్జున సాగర్ కూడా ఎండిపోయే పరిస్థితి వచ్చిందన్నారు. దీని వల్ల నల్లగొండ, ఖమ్మం జిల్లాలకు కూడా నీరు అందదని జగన్ అన్నారు. పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టుకు వ్యతిరేకంగానే తాను దీక్ష చేస్తున్నానని దీనిలో ఎలాటి అనుమానం అక్కర్లేదని జగన్ అన్నారు. రాయలసీమతో పాటు కృష్ణా, గోదావరి డెల్టాలను కాపాడుకునేందుకు తాను దీక్షకు దిగుతున్నానని జగన్ స్పష్టం చేశారు.
Click on Image to Read: