రేవంత్ రెడ్డికి ప్రాణభయం ప్రచారం స్టంటా?
తనకు ప్రాణహాని ఉందంటూ టీడీపీ నేత రేవంత్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించడాన్ని తెలంగాణ రాష్ట్ర సమితి నేతలు లైట్ తీసుకుంటున్నారు. నిత్యం ప్రభుత్వంపై ఏదో ఆరోపణలు చేసే రేవంత్ రెడ్డి ఇలాంటి ఆరోపణలు చేయడంలో వింతేంలేదని అంటున్నారు. మొగుడిని కొట్టి మొగుసాలకెక్కినట్లు ఉందని ఎగతాళి చేస్తున్నారు. ఇంతకీ రేవంత్ రెడ్డి హైకోర్టుకు ఎందుకు వెళ్లారంటే.. ఉమ్మడి ఏపీలో ఉన్నప్పటి నుంచి టీడీపీలో క్రియాశీలక నేతగా ఉంటూ వస్తున్నారు. తెలంగాణకు వ్యతిరేకంగా తెలుగుదేశం ఎలాంటి ప్రకటనలు చేయనప్పటికీ.. దాదాపుగా […]
BY admin30 April 2016 9:55 AM IST
X
admin Updated On: 30 April 2016 9:55 AM IST
తనకు ప్రాణహాని ఉందంటూ టీడీపీ నేత రేవంత్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించడాన్ని తెలంగాణ రాష్ట్ర సమితి నేతలు లైట్ తీసుకుంటున్నారు. నిత్యం ప్రభుత్వంపై ఏదో ఆరోపణలు చేసే రేవంత్ రెడ్డి ఇలాంటి ఆరోపణలు చేయడంలో వింతేంలేదని అంటున్నారు. మొగుడిని కొట్టి మొగుసాలకెక్కినట్లు ఉందని ఎగతాళి చేస్తున్నారు. ఇంతకీ రేవంత్ రెడ్డి హైకోర్టుకు ఎందుకు వెళ్లారంటే.. ఉమ్మడి ఏపీలో ఉన్నప్పటి నుంచి టీడీపీలో క్రియాశీలక నేతగా ఉంటూ వస్తున్నారు. తెలంగాణకు వ్యతిరేకంగా తెలుగుదేశం ఎలాంటి ప్రకటనలు చేయనప్పటికీ.. దాదాపుగా వ్యతిరేకంగానే ప్రవర్తించింది. దీంతో దానికి ఆంధ్రపార్టీగా ముద్రపడిపోయింది. ఇందులో భాగంగా పలుమార్లు తెలుగుదేశం నేతలపై అక్కడక్కడా కొన్ని దాడులు జరిగాయి. అయితే, ఎప్పుడో జరిగిన దాడులను ఆకస్మాత్తుగా గుర్తుచేసుకుని ప్రాణభయం ఉందని రేవంత్ చెప్పడంపై గులాబీ నేతలు లైట్ తీసుకుంటారు. రేవంత్ రెడ్డి పిటిషన్ హాస్యాస్పదంగా ఉందని విమర్శిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ముడుపులు ఇస్తూ… పోలీసులకు రెడ్ హ్యాండెడ్‌గా రేవంత్ దొరికిపోవడం, ఆ వీడియోలు బయటికి రావడం అందరికీ తెలిసిందే. అరెస్టు సమయంలోనూ రేవంత్ సీఎం కేసీఆర్‌ను బూతులు తిట్టాడే గానీ, ఆయనపై ఎవరైనా దాడులు చేశారా? అని గులాబీ నేతలు ప్రశ్నిస్తున్నారు. మా ప్రభుత్వాన్నే పడగొట్టేందుకు ప్రయత్నించి ఇప్పుడు మాపైనే నిందలు వేయడం ఆయన వ్యక్తిత్వాన్ని తెలియజెప్పుతుందని వివరిస్తున్నారు. ఆయన ఎన్ని పిటిషన్లు వేసుకున్నా.. ప్రజలు ఆయనకు బుద్ధి చెప్పే రోజులు ఎంతో దూరంలో లేదని స్పష్టం చేస్తున్నారు.
Next Story