పార్లమెంట్‌కు నన్ను పంపండి..
ప్రత్యేక హోదా అంశం తెరపైకి వచ్చిన ప్రతిసారి టీవీ తెరపై కనిపించిన నటుడు శివాజీ మరోసారి విరుచుకుపడ్డారు. ప్రత్యేకహోదా ఏపీకి అవసరం లేదని కేంద్రమంత్రి రాజ్యసభలో ప్రకటించడంపై శివాజీ మండిపడ్డారు. ఎంపీలు, కేంద్రమంత్రులు సిగ్గుశరం లేకుండా తయారయ్యారని విమర్శించారు. ”బీజేపీ సన్యాసుల్లారా… 14 వ ఆర్థిక సంఘం బిహార్ కు లక్షా25 వేల కోట్ల ప్యాకేజ్ ఇవ్వమందా… అక్కడ ఎలా ఇచ్చారు. మీరు మనుషులేనా” అని ప్రశ్నించారు. మోదీ ఒక కృత్తిమ ప్రధాని అని అన్నారు. ప్రాక్టికల్ […]
ప్రత్యేక హోదా అంశం తెరపైకి వచ్చిన ప్రతిసారి టీవీ తెరపై కనిపించిన నటుడు శివాజీ మరోసారి విరుచుకుపడ్డారు. ప్రత్యేకహోదా ఏపీకి అవసరం లేదని కేంద్రమంత్రి రాజ్యసభలో ప్రకటించడంపై శివాజీ మండిపడ్డారు. ఎంపీలు, కేంద్రమంత్రులు సిగ్గుశరం లేకుండా తయారయ్యారని విమర్శించారు. ”బీజేపీ సన్యాసుల్లారా… 14 వ ఆర్థిక సంఘం బిహార్ కు లక్షా25 వేల కోట్ల ప్యాకేజ్ ఇవ్వమందా… అక్కడ ఎలా ఇచ్చారు. మీరు మనుషులేనా” అని ప్రశ్నించారు.
మోదీ ఒక కృత్తిమ ప్రధాని అని అన్నారు. ప్రాక్టికల్ ప్రధాని కానేకాదన్నారు. అంతే కాదు తెలంగాణ ఎలా సాకారం అయిందో తెలియదా అని ప్రశ్నించారు. తెలంగాణ ఎంపీల తరహాలో ఎందుకు పార్లమెంట్లో పోరాటం చేయడం లేదని ప్రశ్నించారు. తనను పార్లమెంట్ కు పంపిస్తే చూపిస్తానన్నారు. ప్రజలు సినిమా టికెట్ కొంటే తాము బతికామని ఆ కృతజ్ఞతతోనే ప్రజల తరపున పోరాటం చేస్తామన్నారు. కేంద్రం ఏపీని నిలువుగా ముంచిందని ఆంధ్రామేధావుల సంఘం చలసాని శ్రీనివాస్ అన్నారు. అయితే నటుడు శివాజీ, చలసాని శ్రీనివాస్ లు చంద్రబాబుకు ఇబ్బంది కలిగిన సమయంలో తెరపైకి వస్తుంటారన్న విమర్శ కూడా ఉంది. చంద్రబాబును కాపాడేందుకు ఇలా బీజేపీపై విరుచుకుపడుతుంటారని పలువులు అంటుంటారు.
Click on Image to Read: