జగన్ కోసం కొత్త కుట్ర సిద్ధం!
తాను చేస్తే శృంగారం, పక్కోడు చేస్తే వ్యభిచారం. ఈ ఫార్ములాను అమలు చేయడంలో టీడీపీకి మించిన వారు ఎవరూ ఉండరు కాబోలు. మొన్నటి ఎన్నికల్లో బీజేపీని బాగా వాడేసిన టీడీపీ ఇప్పుడు అవసరం తీరింది కాబట్టి బీజేపీని వైసీపీకి అంటగట్టేందుకు రెడీ అవుతోంది. ఇందులో భాగంగా ఎప్పటిలాగే బాబు కీలక ప్రతిక కథనాలు మొదలుపెట్టింది. జగన్ ఢిల్లీ పర్యటన తర్వాత పరిణామాలు చూస్తుంటే వచ్చే ఎన్నికల నాటికి బీజేపీ, జగన్ పొత్తు పెట్టుకునే సూచనలు కనిపిస్తున్నాయని పలువురు నేతలు సదరు […]
తాను చేస్తే శృంగారం, పక్కోడు చేస్తే వ్యభిచారం. ఈ ఫార్ములాను అమలు చేయడంలో టీడీపీకి మించిన వారు ఎవరూ ఉండరు కాబోలు. మొన్నటి ఎన్నికల్లో బీజేపీని బాగా వాడేసిన టీడీపీ ఇప్పుడు అవసరం తీరింది కాబట్టి బీజేపీని వైసీపీకి అంటగట్టేందుకు రెడీ అవుతోంది. ఇందులో భాగంగా ఎప్పటిలాగే బాబు కీలక ప్రతిక కథనాలు మొదలుపెట్టింది. జగన్ ఢిల్లీ పర్యటన తర్వాత పరిణామాలు చూస్తుంటే వచ్చే ఎన్నికల నాటికి బీజేపీ, జగన్ పొత్తు పెట్టుకునే సూచనలు కనిపిస్తున్నాయని పలువురు నేతలు సదరు పత్రిక దగ్గర అభిప్రాయపడ్డారట. ఇలా బీజేపీని జగన్‌కు అంటగట్టడం కొత్త కుట్రను సిద్ధం చేయడమే అంటున్నారు.
జగన్‌కు ఏపీలో మైనార్టీలు, దళితుల్లో గట్టి ఓటు బ్యాంకు ఉంది. వారంతా బీజేపీకి ఎట్టి పరిస్థితుల్లోనూ ఓటే వేయరు. అయితే 2014 ఎన్నికల సమయంలో మోదీ మ్యానియా వాసనను పసిగట్టిన చంద్రబాబు బీజేపీతో జత కట్టారు. అతికష్టం మీద సీఎం అయ్యారు. కానీ ఇప్పుడు మోదీ మీద జనంలోనూ మోజు తగ్గుతోంది. అంతేకాక ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యం కాదని కేంద్రం తేల్చేసింది. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో బీజేపీతో పొత్తుపెట్టుకుని ఎన్నికలకు ఏ పార్టీ వెళ్లినా ఏపీలో దారుణంగా దెబ్బతినక తప్పదు. అందుకే…
ఇప్పుడు బీజేపీని వైసీపీ మెడకు చుట్టేందుకు టీడీపీ మీడియా పద్దతి ప్రకారం కథనాలు మొదలుపెట్టింది. వచ్చే ఎన్నికల నాటికి మతతత్వ పార్టీతో జగన్ జత కట్టారంటూ టీడీపీ ప్రచారం చేస్తుంది. దాని ద్వారా మైనార్టీ, దళిత ఓట్లను జగన్ నుంచి దూరం చేసేందుకు ప్లాన్ చేస్తుందన్న మాట. పొత్తు పెట్టుకుని 2014 ఎన్నికలకు వెళ్లిన టీడీపీ హఠాత్తుగా బీజేపీని మతతత్వ పార్టీ అని విమర్శిస్తే జనం నమ్ముతారా అన్న అనుమానం అక్కర్లేదు. ఎందుకంటే కడప ఎంపీ ఉప ఎన్నికల సమయంలోనూ బీజేపీ మతతత్వ పార్టీ… ఆ పార్టీతో జగన్ దోస్తి చేస్తున్నారంటూ చంద్రబాబే స్వయంగా కడప గడ్డపై చెప్పారు. కానీ ఎన్నికలు సమీపించగానే మోదీ ముందు మోకరిల్లారు. కాబట్టి మరోసారి గురివింద ప్రచారం చేసేందుకు టీడీపీ ఏ మాత్రం వెనుకాడదు. మరి బీజేపీ, జగన్ దోస్తి కడుతున్నారంటూ టీడీపీ మీడియా మొదలుపెట్టిన ప్రచారాన్ని వైసీపీ ఏ విధంగా రిసీవ్ చేసుకుంటుందో?.
Click on Image to Read: