అగ్రవర్ణాలకు రిజర్వేషన్‌పై గుజరాత్ సంచలన నిర్ణయం
రిజర్వేషన్లపై గుజరాత్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఆర్థికంగా వెనుకబడిన అగ్రకులాలకు 10 శాతం రిజర్వేషన్లు ప్రకటించింది. పటేళ్ల ఆందోళన నేపథ్యంలో దిగివచ్చిన బీజేపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే గుజరాత్‌తో 49 శాతం రిజర్వేషన్లు అమలులో ఉన్నాయి. అయితే ఆ కోటా జోలికి వెళ్లకుండా అదనంగా 10 శాతం రిజర్వేషన్లు పెంచారు. ఈ పది శాతం రిజర్వేషన్ల ద్వారా నాన్ రిజర్వ్‌డ్ కేటగిరిలో ఉన్న పటేళ్లు, బ్రాహ్మణులు, క్షత్రియులు, ఇతర కులాలకు విద్యా, ఉపాధి […]
రిజర్వేషన్లపై గుజరాత్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఆర్థికంగా వెనుకబడిన అగ్రకులాలకు 10 శాతం రిజర్వేషన్లు ప్రకటించింది. పటేళ్ల ఆందోళన నేపథ్యంలో దిగివచ్చిన బీజేపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే గుజరాత్‌తో 49 శాతం రిజర్వేషన్లు అమలులో ఉన్నాయి. అయితే ఆ కోటా జోలికి వెళ్లకుండా అదనంగా 10 శాతం రిజర్వేషన్లు పెంచారు. ఈ పది శాతం రిజర్వేషన్ల ద్వారా నాన్ రిజర్వ్‌డ్ కేటగిరిలో ఉన్న పటేళ్లు, బ్రాహ్మణులు, క్షత్రియులు, ఇతర కులాలకు విద్యా, ఉపాధి అంశాల్లో అవకాశాలు కల్పించనున్నారు. ఇప్పటికే రిజర్వేషన్లు అనుభవిస్తున్న వర్గాలు ఈ 10 శాతం కోటాలోకి రావు. అయితే ఆర్థిక అంశాల ప్రాతిపదికన ఈ రిజర్వేషన్ ఇవ్వనున్నారు. పటేళ్లు రిజర్వేషన్ల కోసం పోరాటం చేయగా… మొత్తం అన్ని అగ్రవర్గాలకు కలిపి రిజర్వేషన్లు కల్పించడం విశేషం. వార్షిక ఆదాయం రూ. 6 లక్షలకు లోపు ఉన్న ఓబీసీలకు ఈ రిజర్వేషన్లు వర్తిస్తాయి. మే 1 నుంచి రిజర్వేషన్లు అమలులోకి వస్తాయని గుజరాత్ ముఖ్యమంత్రి ప్రకటించారు.
Click on Image to Read: