సింగిల్‌గా కాదు... డీజీపీ, ఇంటెలిజెన్స్ ఐజీని కూడా వెంట తెచ్చుకో..
అవినీతిపై జగన్ బహిరంగ చర్చకు రావాలని నారా లోకేష్ చేసిన సవాల్‌పై వైసీపీ నేత అంబటి రాంబాబు స్పందించారు. లోకేష్, టీడీపీ నేతల ముఖాలకు జగన్ రావాలా అని ప్రశ్నించారు. లోకేష్‌తో బహిరంగ చర్చకు తానే వస్తానని రేపు సాయంత్రంలోగా డేట్, ప్లేసు చెప్పాలని అంబటి సవాల్ చేశారు. లేకుండా తన పార్టీ నుంచి ఒక కార్యకర్తను పంపుతామని అతడితో వాదించి గెలవండి చాలు అని అన్నారు. అసలు లోకేష్ స్థాయి ఏంటని ప్రశ్నించారు. ఉత్తరకుమారుడు లాంటి […]
అవినీతిపై జగన్ బహిరంగ చర్చకు రావాలని నారా లోకేష్ చేసిన సవాల్‌పై వైసీపీ నేత అంబటి రాంబాబు స్పందించారు. లోకేష్, టీడీపీ నేతల ముఖాలకు జగన్ రావాలా అని ప్రశ్నించారు. లోకేష్‌తో బహిరంగ చర్చకు తానే వస్తానని రేపు సాయంత్రంలోగా డేట్, ప్లేసు చెప్పాలని అంబటి సవాల్ చేశారు. లేకుండా తన పార్టీ నుంచి ఒక కార్యకర్తను పంపుతామని అతడితో వాదించి గెలవండి చాలు అని అన్నారు. అసలు లోకేష్ స్థాయి ఏంటని ప్రశ్నించారు.
ఉత్తరకుమారుడు లాంటి లోకేష్‌ను తండ్రి చంద్రబాబుకు ఉన్న పదవిని చూసి టీడీపీ నేతలు పొగుడుతున్నారని ఎద్దేవా చేశారు. ఏనాడు జనంలో గెలవని లోకేష్ కు జగన్‌ను విమర్శించే స్థాయి ఎక్కడుందని ప్రశ్నించారు. చంద్రబాబు అవినీతిపై ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లోనైనా విజయవాడలోనైనా చర్చకు సిద్ధమన్నారు. లోకేష్ ఒంటరిగా రావడానికి భయమేస్తే దేవినేని ఉమా, సుజనా చౌదరి, పత్తిపాటి పుల్లారావును కూడా వెంట తెచ్చుకోవాలన్నారు.
లోకేష్‌కు అప్పటికీ భయం ఉంటే టీడీపీ కార్యకర్తలుగా పనిచేస్తున్న డీజీపీ రాముడు, ఇంటెలిజెన్స్ ఐజీ వెంకటేశ్వరరావును కూడా వెంటతెచ్చుకోవాలని సూచించారు. జగన్‌కు అపాయింట్‌మెంట్ ఇస్తే తన పరువు పోతుందని మోదీని చంద్రబాబు వేడుకున్నారని అంబటి చెప్పారు. అయినా రాజ్‌నాథ్ సింగ్, అరుణ్ జైట్లీ లాంటి కీలక మంత్రులు జగన్‌కు అపాయింట్‌మెంట్ ఇచ్చారని అన్నారు. కేసులు ఉన్న జగన్‌కు కేంద్రమంత్రులు ఎలా అపాయింట్‌మెంట్ ఇస్తారని అంటున్న యనమల రామకృష్ణుడికి సిగ్గుందా అని ప్రశ్నించారు.
వందల కోట్లు బ్యాంకులకు ఎగ్గొట్టిన సుజనా చౌదరి సంగతేంటని ప్రశ్నించారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికి నిత్యం కోర్టుల చుట్టూ తిరుగుతున్న రేవంత్‌కు తెలంగాణ పార్టీ పగ్గాలు ఎలా అప్పగించారని ప్రశ్నించారు. జగన్ ఢిల్లీ పర్యటన ద్వారా చంద్రబాబు అవినీతి బతుకంతా దేశం మొత్తం తెలిసిపోయిందని అంబటి రాంబాబు అన్నారు.
Click on Image to Read: