సరైనోడుకి సరైన అవకాశం దొరికింది
సరైనోడు సినిమాకు ఇప్పటికే ఫ్లాప్ టాక్ వచ్చేసింది. ఈ టాక్ వల్ల చాలామంది థియేటర్లకు వెళ్లడం మానేశారు. వెళ్దాం అనుకునేవాళ్లు కూడా డ్రాప్ అయ్యారు. దీంతో సినిమాకు వసూళ్లు బాగా పడిపోయాయి. కానీ జనాలకు వేరే ఆప్షన్ లేదు. సినిమా చూడాలనుకుంటే సరైనోడు మాత్రమే చూడాలి. అలాంటి అద్భుతమైన గ్యాప్ లో వచ్చాడు సరైనోడు. సో… చాలామంది అయిష్టంగానైనా సినిమాకు వెళ్తున్నారు. దీంతో ఊహించని విధంగా ఇప్పటికే 36కోట్ల రూపాయల షేర్ రాబట్టింది ఈ సినిమా. బన్నీ […]
BY sarvi29 April 2016 3:33 AM IST
X
sarvi Updated On: 29 April 2016 5:24 AM IST
సరైనోడు సినిమాకు ఇప్పటికే ఫ్లాప్ టాక్ వచ్చేసింది. ఈ టాక్ వల్ల చాలామంది థియేటర్లకు వెళ్లడం మానేశారు. వెళ్దాం అనుకునేవాళ్లు కూడా డ్రాప్ అయ్యారు. దీంతో సినిమాకు వసూళ్లు బాగా పడిపోయాయి. కానీ జనాలకు వేరే ఆప్షన్ లేదు. సినిమా చూడాలనుకుంటే సరైనోడు మాత్రమే చూడాలి. అలాంటి అద్భుతమైన గ్యాప్ లో వచ్చాడు సరైనోడు. సో… చాలామంది అయిష్టంగానైనా సినిమాకు వెళ్తున్నారు. దీంతో ఊహించని విధంగా ఇప్పటికే 36కోట్ల రూపాయల షేర్ రాబట్టింది ఈ సినిమా. బన్నీ ట్రాక్ రికార్డుల ఆధారంగా చూస్తే… సరైనోడు సినిమాకు 55 కోట్ల రూపాయల షేర్ వస్తే సినిమా హిట్టయినట్టే. ఇక్కడే సరైనోడుకు స్కోప్ బాగా పెరిగింది. ఇప్పటికే ఒక వారం పూర్తిచేసుకున్న ఈ సినిమా.. .ఎలాంటి ఆటంకం లేకుండా మరో వారం నడవడానికి లైన్ క్లియర్ అయింది. సూర్య నటించిన 24 సినిమా మినహా మరో పెద్ద సినిమా రేసులో లేకపోవడంతో… బన్నీ సినిమాకు మరో వీకెండ్ దొరికింది. ఈ శని, ఆదివారాల్లో బాగా వసూళ్లు రాబట్టడంతో పాటు… సాధారణ రోజుల్లో సరైనోడు సినిమా ఓ మోస్తరుగా ఆడితే…. 55కోట్ల షేర్ పెద్ద సమస్య కాదు. అప్పుడు సినిమా హిట్ లిస్ట్ లోకి చేరిపోతుంది. సరైనోడుకు నిజంగా ఇది సరైన అవకాశం.
Next Story