మైసూరా పార్టీ వీడడంపై స్పందించిన జగన్
సేవ్ డెమొక్రసీ పేరులో ఢిల్లీలో పర్యటిస్తున్నా జగన్ బృందం బుధవారం కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని కలిసింది. ఏపీలో పార్టీ ఫిరాయింపులను చంద్రబాబు ప్రోత్సహిస్తున్న తీరును జగన్ వివరించారు. చంద్రబాబు అవినీతిపై రాసిన పుస్తకాన్ని అందజేశారు. రాష్ట్రంలో సాగుతున్న అవినీతి, అక్రమాలపై సీబీఐ విచారణకు ఆదేశించేలా చూడాలని కోరారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించే విషయంలో చొరవ తీసుకోవాలని, రైల్వే జోన్, పోలవరం ప్రాజెక్ట్‌ను వెంటనే పూర్తి చేయాలని అరుణ్ జైట్లీని జగన్ బృందం కోరింది. […]
సేవ్ డెమొక్రసీ పేరులో ఢిల్లీలో పర్యటిస్తున్నా జగన్ బృందం బుధవారం కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని కలిసింది. ఏపీలో పార్టీ ఫిరాయింపులను చంద్రబాబు ప్రోత్సహిస్తున్న తీరును జగన్ వివరించారు. చంద్రబాబు అవినీతిపై రాసిన పుస్తకాన్ని అందజేశారు. రాష్ట్రంలో సాగుతున్న అవినీతి, అక్రమాలపై సీబీఐ విచారణకు ఆదేశించేలా చూడాలని కోరారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించే విషయంలో చొరవ తీసుకోవాలని, రైల్వే జోన్, పోలవరం ప్రాజెక్ట్‌ను వెంటనే పూర్తి చేయాలని అరుణ్ జైట్లీని జగన్ బృందం కోరింది. మైసూరా రెడ్డి పార్టీ వీడిన అంశంపైనా జగన్ స్పందించారు. మైసూరారెడ్డి చాలా కాలంగా పార్టీకి దూరంగా ఉంటున్నారని అన్నారు. తాను కూడా మైసూరారెడ్డిని నేరుగా చూసి ఆరు నెలలైందన్నారు జగన్. మైసూరారెడ్డి పార్టీ వీడడంపై జగన్ ఆశ్చర్యపోయినట్టుగా అనిపించలేదు. ముందే మానసికంగా సిద్ధమైనట్టుగా ఉంది.
Click on Image to Read: