Telugu Global
NEWS

మైసూరా లేఖ!… సాయిరెడ్డి గొప్పా? మైసూరా గొప్పా?

చాలాకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న సీనియర్ నేత మైసూరారెడ్డి వైసీపీకి గుడ్‌బై చెప్పేస్తున్నారు. బుధవారం జగన్‌కు తన రాజీనామా లేఖను ఫ్యాక్స్ ద్వారా పంపనున్నారు. పార్టీలో తనకు ఎదురైన అనుభవాలను లేఖలో మైసూరా వివరించనున్నారట.

చాలాకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న సీనియర్ నేత మైసూరారెడ్డి వైసీపీకి గుడ్‌బై చెప్పేస్తున్నారు. బుధవారం జగన్‌కు తన రాజీనామా లేఖను ఫ్యాక్స్ ద్వారా పంపనున్నారు. పార్టీలో తనకు ఎదురైన అనుభవాలను లేఖలో మైసూరా వివరించనున్నారట. రాజ్యసభ సీటు విషయంలోనే మైసూరారెడ్డి పార్టీ వీడుతున్నారని చెబుతున్నారు. రాజ్యసభకు వెళ్లాలని మైసూరారెడ్డి ఆశ పడగా విజయసాయిరెడ్డికి జగన్‌ అవకాశం ఇవ్వబోతున్నారు. సాయిరెడ్డికి టికెట్ దాదాపు ఖాయం అయిపోవడంతో మైసూరారెడ్డి పార్టీ వీడేందుకు సిద్ధమయ్యారు.

అయితే రాజ్యసభ సీటు మైసూరాకు ఇవ్వడం కరెక్టా లేక విజయసాయిరెడ్డికి అవకాశం ఇవ్వడమే న్యాయమా అన్న దానిపై వైసీపీలో చర్చ జరుగుతోంది.చాలా మంది విజయసాయిరెడ్డికి టికెట్ ఇవ్వడమే సరైన నిర్ణయం అంటున్నారు. మైసూరారెడ్డి ఇప్పటికే చాలా పార్టీలు మారారు. పలు కీలక పదవులు నిర్వహించారు. రాజ్యసభకు కూడా ఎన్నికయ్యారు. అయితే జగన్‌ కోసం విజయసాయిరెడ్డి పడ్డ కష్టం ముందు మైసూరా పార్టీకి చేసిన సేవను పోల్చలేమంటున్నారు.

జగన్‌ కోసం ఏడాదికిపైగా జైలుకు వెళ్లిన వ్యక్తి విజయసాయిరెడ్డి అని అంటున్నారు. సీబీఐ, అప్పటి కాంగ్రెస్ ఎంత ఒత్తిడి చేసినా లొంగకుండా నిలబడిన వ్యక్తి సాయిరెడ్డి అని గుర్తుచేస్తున్నారు. అలాంటి వ్యక్తికి అవకాశం ఇవ్వకపోతే పొరపాటు అవుతుందంటున్నారు. మైసూరారెడ్డి లాంటి సీనియర్ నేత సేవలు పార్టీకి అవసరం అయినప్పటికీ … ప్రతిపక్షంలో ఉన్న పార్టీ ప్రతి ఒక్కరి ఆకాంక్షలను నెరవేర్చడం కష్టమంటున్నారు. అయితే పట్టిసీమ, క్యాపిటల్ విషయంలో జగన్ తను ఇచ్చిన సలహాలను పెడచెవిన పెట్టి పార్టీ స్టాండ్ లో గందరగోళం సృష్తించడం మైసూరా కోపానికి మరో కారణమని ఆయన గురించి బాగా తెలిసిన వారంటుంటారు.

First Published:  27 April 2016 4:08 AM IST
Next Story