తనపై పుకార్లను ఖండించిన లక్ష్మీనారాయణ
సీబీఐ మాజీ జేడీ, మహారాష్ట్ర అడిషినల్ డీజీ లక్ష్మీనారాయణపై ఇటీవల కొన్ని వార్తలొస్తున్నాయి. లక్ష్మినారాయణలో భవిష్యత్తులో టీడీపీలో చేరే యోచనలో ఉన్నారని వార్తలొచ్చాయి. తన రిటైర్‌మెంట్ కూడా ఏపీలోనే ఉండేలా ప్లాన్ చేసుకుంటున్న లక్ష్మినారాయణ అందుకోసం డిప్యుటేషన్‌పై తిరిగి ఆంధ్రప్రదేశ్ వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని వార్తలు ప్రసారం అయ్యాయి. డిప్యుటేషన్‌పై వస్తే అమరావతి కమిషనరేట్‌కు కమిషనర్‌గా లక్ష్మినారాయణను నియమించే యోచనలో చంద్రబాబు ఉన్నారని కూడా వార్తలొచ్చాయి. అయితే ఈ కథనాలను లక్ష్మినారాయణ ఖండించారు. తాను డిప్యుటేషన్‌పై వచ్చేందుకు ఎలాంటి […]
సీబీఐ మాజీ జేడీ, మహారాష్ట్ర అడిషినల్ డీజీ లక్ష్మీనారాయణపై ఇటీవల కొన్ని వార్తలొస్తున్నాయి. లక్ష్మినారాయణలో భవిష్యత్తులో టీడీపీలో చేరే యోచనలో ఉన్నారని వార్తలొచ్చాయి. తన రిటైర్‌మెంట్ కూడా ఏపీలోనే ఉండేలా ప్లాన్ చేసుకుంటున్న లక్ష్మినారాయణ అందుకోసం డిప్యుటేషన్‌పై తిరిగి ఆంధ్రప్రదేశ్ వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని వార్తలు ప్రసారం అయ్యాయి. డిప్యుటేషన్‌పై వస్తే అమరావతి కమిషనరేట్‌కు కమిషనర్‌గా లక్ష్మినారాయణను నియమించే యోచనలో చంద్రబాబు ఉన్నారని కూడా వార్తలొచ్చాయి. అయితే ఈ కథనాలను లక్ష్మినారాయణ ఖండించారు. తాను డిప్యుటేషన్‌పై వచ్చేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేయడం లేదని చెప్పారు. ఇలాంటి వార్తలు ప్రసారం చేయవద్దని కోరారు. లక్ష్మినారాయణ డిప్యుటేషన్‌పై వచ్చే అంశాన్ని డీజీపీ రాముడు కూడా తోసిపుచ్చారు. లక్ష్మినారాయణ ఏపీకి వచ్చే అవకాశాలు లేవన్నారు. అలాంటి ప్రతిపాదన ఏమీ లేదన్నారు.
జగన్ ఆస్తుల కేసులో సీబీఐ జేడీగా లక్ష్మీనారాయణ చూపిన చొరవకు అప్పట్లో టీడీపీ అభిమానులు పెద్దెత్తున ఫ్యాన్స్ అయ్యారు. దీంతో ఆయన రాజకీయంగా టీడీపీలోకి ఎంటరయ్యే అవకాశం ఉందంటూ ఇటీవల వార్తలొచ్చారు. లక్ష్మీనారాయణ ఏపీకి ఎప్పుడొచ్చినా, ఏ గుడికి వెళ్లినా టీడీపీ అనుకూల మీడియా కూడా పెద్దెత్తున ప్రచారం కల్సిస్తుండడం కూడా ఆ భావనకు బలం చేకూర్చింది.
Click on Image to Read: