Telugu Global
Others

ఇద్ద‌రు చంద్రుల‌కు ల‌క్ష్మ‌ణ్ హెచ్చ‌రిక‌!

పార్టీ ఫిరాయింపుల‌పై తెలంగాణ బీజేపీ నేత ల‌క్ష్మ‌ణ్ స్పందించారు. రెండు రాష్ర్టాల్లో జ‌రుగుతున్న పార్టీ ఫిరాయింపులు అనారోగ్య‌క‌ర రాజ‌కీయాల‌కు సంకేతంగా వ‌ర్ణించారు. ఈ విష‌యంలో రెండు రాష్ర్టాల సీఎంల తీరును ఆయ‌న త‌ప్పుబ‌ట్టారు. అయితే, విమ‌ర్శించే విష‌యంలో మిత్రుడు, ఏపీ సీఎం చంద్ర‌బాబు పేరును నేరుగా ప్ర‌స్తావించ‌లేదు. ఎలాగూ ఆయ‌న తెలంగాణ బీజేపీ శాఖ‌కు అధ్య‌క్షుడు కాబ‌ట్టి కేసీఆర్ పేరును నేరుగా ప్ర‌స్తావించారు. ఇబ్బ‌డిముబ్బ‌డి చేరిక‌ల‌తో టీఆర్ ఎస్ పార్టీ గాలిబుడ‌గ‌లా మారింద‌ని విమ‌ర్శించారు. అది ఎప్పుడైనా ప‌గిలిపోవ‌చ్చ‌ని […]

ఇద్ద‌రు చంద్రుల‌కు ల‌క్ష్మ‌ణ్ హెచ్చ‌రిక‌!
X
పార్టీ ఫిరాయింపుల‌పై తెలంగాణ బీజేపీ నేత ల‌క్ష్మ‌ణ్ స్పందించారు. రెండు రాష్ర్టాల్లో జ‌రుగుతున్న పార్టీ ఫిరాయింపులు అనారోగ్య‌క‌ర రాజ‌కీయాల‌కు సంకేతంగా వ‌ర్ణించారు. ఈ విష‌యంలో రెండు రాష్ర్టాల సీఎంల తీరును ఆయ‌న త‌ప్పుబ‌ట్టారు. అయితే, విమ‌ర్శించే విష‌యంలో మిత్రుడు, ఏపీ సీఎం చంద్ర‌బాబు పేరును నేరుగా ప్ర‌స్తావించ‌లేదు. ఎలాగూ ఆయ‌న తెలంగాణ బీజేపీ శాఖ‌కు అధ్య‌క్షుడు కాబ‌ట్టి కేసీఆర్ పేరును నేరుగా ప్ర‌స్తావించారు.
ఇబ్బ‌డిముబ్బ‌డి చేరిక‌ల‌తో టీఆర్ ఎస్ పార్టీ గాలిబుడ‌గ‌లా మారింద‌ని విమ‌ర్శించారు. అది ఎప్పుడైనా ప‌గిలిపోవ‌చ్చ‌ని హెచ్చ‌రించారు. గ‌తంలో కేంద్రంలో రెండంటే.. రెండే స్థానాల‌తో పార్ల‌మెంటులో అడుగుపెట్టిన త‌మ‌పార్టీకి ప్ర‌జ‌లు నేడు సంపూర్ణ మెజారిటీ క‌ట్ట‌బెట్టార‌ని గుర్తు చేశారు.
ఈ స్ఫూర్తితో తెలంగాణ‌లో గ్రామ‌గ్రామాన పార్టీని విస్త‌రిస్తామ‌ని ప్ర‌తిజ్ఞ చేశారు. ఇదే స‌మ‌యంలో ప‌రోక్షంగా ఇద్ద‌రు చంద్రుల‌కు మ‌రో హెచ్చ‌రిక పంపారు. అదేంటంటే.. 2019లో తెలంగాణ‌లో ఒంట‌రిగా అధికారంలోకి రావ‌డ‌మే ల‌క్ష్యంగా పెట్టుకున్నామ‌ని వెల్ల‌డించారు. ఇంత‌టి సాహోసోపేత‌మైన ల‌క్ష్యానికి సుదీర్ఘ మిత్ర‌ప‌క్షం టీడీపీ సాయం లేకుండానే ఒంట‌రిగా ఎన్నిక‌ల్లో పోటీ చేసి ఏకంగా అధికారం కైవ‌సం చేసుకుంటామ‌ని చెప్పారు. ల‌క్ష్మ‌ణ్ ల‌క్ష్యానికి.. ప‌ట్టుద‌ల‌కు బీజేపీ కార్య‌క‌ర్త‌లు ముచ్చ‌ట‌ప‌డుతున్నా.. టీడీపీ సాయం లేకుండా తాము ఎన్నిస్థానాలు గెల‌వ‌గ‌లం.. అస్స‌లు బీజేపీ క‌ల నెర‌వేరేందుకు ఎంత‌కాలం ప‌డుతుంది? అన్న విష‌యంలో మాత్రం బుర్ర‌లు బ‌ద్ద‌లు కొట్టుకుంటున్నారు.
First Published:  26 April 2016 4:42 AM IST
Next Story