ఒకే రోజు.... రెండు మెగా పండగలు....
ఎన్నాళ్లో వేచిన ఉదయం మరికొన్ని రోజుల్లో రాబోతోంది. చిరంజీవి 150వ సినిమా కోసం కళ్లుకాయలు కాచేలా ఎదురుచూస్తున్న అభిమానులకు ఆ నిరీక్షణ నెరవేరబోతోంది. ఒక దశలో అభిమానులంతా చిరంజీవిపై ఒకింత అసహనాన్ని కూడా ప్రదర్శించిన నేపథ్యంలో…. ఎండలు మండిపోతున్నప్పటికీ చిరంజీవి తన 150వ సినిమాకు కొబ్బరికాయ కొట్టాలని ఫిక్స్ అయ్యారు. ఈ నెలలోనే చిరంజీవి 150వ సినిమా ప్రారంభమౌతుంది. ఇంకా పర్ ఫెక్ట్ గా చెప్పాలంటే…. ఈనెల 29న మధ్యాహ్నం 1.30 నిమిషాలకు చిరంజీవి 150వ సినిమా ప్రారంభమౌతుంది. […]

ఎన్నాళ్లో వేచిన ఉదయం మరికొన్ని రోజుల్లో రాబోతోంది. చిరంజీవి 150వ సినిమా కోసం కళ్లుకాయలు కాచేలా ఎదురుచూస్తున్న అభిమానులకు ఆ నిరీక్షణ నెరవేరబోతోంది. ఒక దశలో అభిమానులంతా చిరంజీవిపై ఒకింత అసహనాన్ని కూడా ప్రదర్శించిన నేపథ్యంలో…. ఎండలు మండిపోతున్నప్పటికీ చిరంజీవి తన 150వ సినిమాకు కొబ్బరికాయ కొట్టాలని ఫిక్స్ అయ్యారు. ఈ నెలలోనే చిరంజీవి 150వ సినిమా ప్రారంభమౌతుంది. ఇంకా పర్ ఫెక్ట్ గా చెప్పాలంటే…. ఈనెల 29న మధ్యాహ్నం 1.30 నిమిషాలకు చిరంజీవి 150వ సినిమా ప్రారంభమౌతుంది. వీవీ వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాకు రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరిస్తాడు. లైక్ ప్రొడక్షన్స్ అనే సంస్థ కూడా సహనిర్మాతగా వ్యవహరించనుంది. అయితే సినిమా ఓపెనింగ్ డేట్ ఫిక్స్ అయినప్పటికీ… అది ఏ సినిమా అనేది ఇంకా క్లారిటీ రాలేదు. కత్తి రీమేక్ అనేది ఆ రోజు కన్ ఫర్మ్ అయ్యే అవకాశాలున్నాయి. మరోవైపు అన్నయ్యతో పాటు పవన్ కల్యాణ్ కూడా తన కొత్త సినిమాను అదే రోజు ప్రారంభించే అవకాశాలున్నాయి. ఓ మంచి రోజు కోసం జ్యోతిష్కుల్ని సంప్రదిస్తే వాళ్లు ఈనెల 29వ తేదీనే సూచించారట. సో…. అన్నీ అనుకున్నట్టు జరిగితే పవన్-ఎస్ జే సూర్య కాంబినేషన్ లో రాబోతున్న సినిమా కూడా 29నే ప్రారంభమయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. పవన్ తో సర్దార్ సినిమా చేసి నష్టాలు తెచ్చుకున్న శరత్ మరార్… ఈ సినిమాకు కూడా నిర్మాతగా వ్యవహరించనున్నాడు.