ముగ్గురూ ముసుగు దొంగల్లా బతికారట?
వైసీపీ నుంచి టీడీపీలోకి జంప్ చేసేందుకు మరో ముగ్గురు సిద్ధమయ్యారు. కర్నూలు జిల్లా వైసీపీ అధ్యక్షుడు బుడ్డా రాజశేఖర్ రెడ్డి, అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, అరకు ఎమ్మెల్యే సర్వేశ్వరరావులు పార్టీ వీడేందుకు సిద్ధమయ్యారు. కార్యకర్తలతో చర్చలు ఒక రౌండ్ ముగించారు ముగ్గురు ఎమ్మెల్యేలు. ఈనెల 27, 28 తేదీల్లో వీరు సైకిల్ ఎక్కనున్నారు. అయితే ఈ ముగ్గురు కూడా ఇంతకాలం వైసీపీలో అనుమానాస్పదంగా సంచరించారని పార్టీ నేతలు చెబుతున్నారు. అరకు ఎమ్మెల్యే సర్వేశ్వరరావు మాజీ మంత్రి […]
వైసీపీ నుంచి టీడీపీలోకి జంప్ చేసేందుకు మరో ముగ్గురు సిద్ధమయ్యారు. కర్నూలు జిల్లా వైసీపీ అధ్యక్షుడు బుడ్డా రాజశేఖర్ రెడ్డి, అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, అరకు ఎమ్మెల్యే సర్వేశ్వరరావులు పార్టీ వీడేందుకు సిద్ధమయ్యారు. కార్యకర్తలతో చర్చలు ఒక రౌండ్ ముగించారు ముగ్గురు ఎమ్మెల్యేలు.
ఈనెల 27, 28 తేదీల్లో వీరు సైకిల్ ఎక్కనున్నారు. అయితే ఈ ముగ్గురు కూడా ఇంతకాలం వైసీపీలో అనుమానాస్పదంగా సంచరించారని పార్టీ నేతలు చెబుతున్నారు. అరకు ఎమ్మెల్యే సర్వేశ్వరరావు మాజీ మంత్రి కొణతాలకు ముఖ్య అనుచరుడు. ఆయన పార్టీ వీడినప్పుడే ఈయన కూడా జంప్ చేస్తారని గట్టిగా భావించారు. కానీ టైమింగ్ కోసం పార్టీలోనే కొనసాగారు. ఒక విధంగా ముసుగు దొంగలా పార్టీలో సంచరించారని చెబుతున్నారు.
ఎందుకంటే వైసీపీ ఎమ్మెల్యేలకు నియోజకవర్గ అభివృధ్ధి నిధులను చంద్రబాబు విడుదల చేయడం లేదు. కానీ సర్వేశ్వరరావుకు మాత్రం రెండు కోట్లు ఇచ్చారు. ఈ విషయాన్ని అసెంబ్లీ సమావేశాల్లో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడే స్వయంగా చెప్పారు. గొట్టి పాటి రవికుమార్‌పై వ్యాపార ఒత్తిళ్లు, సామాజికవర్గ ఒత్తిడి అధికంగా ఉందని చెబుతున్నారు. వ్యాపార అభివృద్ధి కోసం ఆయన అధికార పార్టీ వైపు చేరుతున్నారని చెబుతున్నారు. తన వ్యాపారాల్లో టీడీపీ నేతలు ఇబ్బందులు సృష్టిస్తున్నారని కాబట్టి తాను టీడీపీలో చేరుతానని చాలా మంది వైసీపీ నేతల దగ్గర స్వయంగా గొట్టిపాటి చెబుతూ వచ్చారు. గొట్టిపాటి ఇంటి వద్ద విగ్రహావిష్కరణకు వెళ్లిన సమయంలో గొట్టిపాటి రవి తన సోదరుడి లాంటి వాడు అని జగన్ బహిరంగసభలో చెప్పారు. కానీ గొట్టిపాటి మాత్రం మరో వ్యాపనంతో బతికినట్టుగా ఉన్నారని వైసీపీ నేతల భావన.
ఇక బుడ్డా రాజశేఖర్ రెడ్డి తీరు చూసి ఇక ఎవరిని నమ్మాలి అని వైసీపీ నేతలు వాపోతున్నారు. సీనియర్లను కాదని ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి గెలిపించడంతో పాటు ఏకంగా కర్నూలు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా నియమిస్తే బుడ్డా మాత్రం క్యాష్‌కు అమ్ముడుపోవడం దారుణంగా ఉందంటున్నారు. ఈయన కూడా భూమాతో పాటే పార్టీ వీడుతారని వార్తలొచ్చాయి. కానీ విడతల వారీగా షాక్‌లు ఇవ్వాలన్న టీడీపీ ఆలోచనతో వైసీపీలోనే ఉండిపోయారు. మొత్తానికి ఈ ముగ్గురు వైసీపీలోనే ముసుగులేసుకుని తిరిగే టీడీపీ కోవర్టులని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
Click on Image to Read: