పోలీసుల అదుపులో మాజీ స్పీకర్ పుత్రుడు!
ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ సురేశ్ రెడ్డి కుమారుడు పోలీసులకు పట్టుబడ్డాడు. కారును అతివేగంగా నడుపుతూ పోలీసుల తనిఖీలో పట్టుబడటంతో ఆయనకు ఫైన్ వేశారు. ఇటీవల కేంద్రమంత్రి సుజనా చౌదరి కుమారుడు కూడా స్పీడ్ రేసుల్లోపాల్గని హైదరాబాద్ పోలీసులకు చిక్కిన సంగతి తెలిసిందే! ఆ ఘటన మరువక ముందే మరో రాజకీయ ప్రముఖుడి కుమారుడు ఇలా పట్టుబడటం నగరంలో సంచలనం సృష్టించింది. కొంతకాలంగా హైదరాబాద్ రోడ్లపై కారు, బైకు రేసులు పెరిగిపోవడంతో వారాంతాల్లో వీటి నివారణకు పోలీసులు కట్టుదిట్టమైన […]
BY sarvi24 April 2016 10:30 PM GMT
X
sarvi Updated On: 25 April 2016 6:54 AM GMT
ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ సురేశ్ రెడ్డి కుమారుడు పోలీసులకు పట్టుబడ్డాడు. కారును అతివేగంగా నడుపుతూ పోలీసుల తనిఖీలో పట్టుబడటంతో ఆయనకు ఫైన్ వేశారు. ఇటీవల కేంద్రమంత్రి సుజనా చౌదరి కుమారుడు కూడా స్పీడ్ రేసుల్లోపాల్గని హైదరాబాద్ పోలీసులకు చిక్కిన సంగతి తెలిసిందే! ఆ ఘటన మరువక ముందే మరో రాజకీయ ప్రముఖుడి కుమారుడు ఇలా పట్టుబడటం నగరంలో సంచలనం సృష్టించింది. కొంతకాలంగా హైదరాబాద్ రోడ్లపై కారు, బైకు రేసులు పెరిగిపోవడంతో వారాంతాల్లో వీటి నివారణకు పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు.
ఇందులో భాగంగానే ఆదివారం రాత్రి సురేశ్ రెడ్డి కుమారుడు అమిత్ రెడ్డి మరికొందరు మిత్రులతో కలిసి కారులో మితిమీరిన వేగంతో వెళుతుండగా పోలీసులు తనిఖీల నిమిత్తం ఆపారు. పరిమితికి మించి వేగంగా వెళుతున్నందుకు అమిత్‌రెడ్డికి జరిమానా విధించారు. ఆరు కార్లు, 10 బైకులను సీజ్ చేసి వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. కౌన్సెలింగ్ అనంతరం వారి వాహనాలను వారికి అప్పగించనున్నట్లు తెలిసింది. విద్యావంతుడు, సామ్యుడిగా పేరు తెచ్చుకున్న సురేశ్ రెడ్డి కుమారుడు ఇలా పోలీసులకు పట్టుబడటం ఆయన అభిమానులు, అనుచరులకు రుచించడం లేదు.
Click on Image to Read:
Next Story