ఆ హోటల్లో బట్టలు విప్పేసి...భోంచేయాలి!
పుర్రెకో బుద్ది…జిహ్వకో రుచి అని ఊరికే అనలేదు. లండన్లో ఒక రెస్టారెంట్లో బట్టలు లేకుండా తినే సదుపాయం కల్పించారు. అవును హోటల్ యాజమాన్యం దాన్ని సదుపాయం అనే అంటోంది. ఆధునిక జీవితంలోని ఒత్తిళ్లకు దూరంగా, చాలా సహజంగా, స్వచ్ఛంగా స్వేచ్ఛగా ఉండే అవకాశాన్ని తాము కల్పిస్తున్నట్టుగా వారు చెబుతున్నారు. దీనికి బునియాదీ అనే హిందీ పేరుని పెట్టారు. అయితే ఈ రెస్టారెంటులో రెండు విభాగాలు ఉంటాయి. దుస్తులు ఉంచుకుని కూడా తినవచ్చు. దుస్తులు లేకుండా ఆహారం తీసుకునే […]
పుర్రెకో బుద్ది…జిహ్వకో రుచి అని ఊరికే అనలేదు. లండన్లో ఒక రెస్టారెంట్లో బట్టలు లేకుండా తినే సదుపాయం కల్పించారు. అవును హోటల్ యాజమాన్యం దాన్ని సదుపాయం అనే అంటోంది. ఆధునిక జీవితంలోని ఒత్తిళ్లకు దూరంగా, చాలా సహజంగా, స్వచ్ఛంగా స్వేచ్ఛగా ఉండే అవకాశాన్ని తాము కల్పిస్తున్నట్టుగా వారు చెబుతున్నారు. దీనికి బునియాదీ అనే హిందీ పేరుని పెట్టారు. అయితే ఈ రెస్టారెంటులో రెండు విభాగాలు ఉంటాయి. దుస్తులు ఉంచుకుని కూడా తినవచ్చు. దుస్తులు లేకుండా ఆహారం తీసుకునే విభాగాన్ని జూన్లో ప్రారంభించబోతున్నారు. ఇప్పటికే 16వేలమంది ఇందులో అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్నారు. బునియాద్ ప్రత్యేకత ఏమిటంటే అక్కడ ఏమాత్రం ఆధునికత కనిపించదు, కృత్రిమ రంగులు, లైట్లు, మెటల్, ప్లాస్టిక్ పాత్రలు, రసాయనాలు వేసి పండించిన కూరగాయలు లాంటివి ఏమీ ఉండవు. గుహల్లో జీవించిన మానవుడిని తిరిగి గుర్తుచేసి నిజమైన స్వేచ్ఛకి అర్థం చెబుతామంటున్నారు వారు. అక్కడ కొవ్వొత్తులు మాత్రమే ఉంటాయి. కస్టమర్లు ఒకరికొకరు కనిపించకుండా సీటింగ్ ఏర్పాటు ఉంటుంది. వంట చేసేవారు దుస్తులు వేసుకుంటారు. సప్లయి చేసేవారు మాత్రం కనీస దుస్తులు ధరిస్తారు. అయితే సీట్లమీద కూర్చున్నవారి శరీరం నుండి బ్యాక్టీరియా కుర్చీలకు చేరకుండా ఉండేందుకు వారు తమ దుస్తులను వాటిమీద వేసుకుని కూర్చోవాలి. దుస్తులు తీసి, తిరిగి ధరించేందుకు ప్రత్యేక వసతి ఉంది. ఫోన్లు, ఫొటోలు తీయడం నిషిద్ధం. ప్లేట్లు మెటల్‌వి కాకుండా తినే వీలున్న పదార్థంతోనే తయారుచేసినవై ఉంటాయి. ఫర్నిచర్ అంతా చక్కతోనూ, వెదురుతోనూ చేసినవే ఉంటాయి. కట్టెల పొయ్యిమీద మట్టి పాత్రల్లోనే వంట చేస్తారు. మొత్తానికి ఈ వింత అనుభూతిని అనుభవించడానికి అక్కడ చాలామందే ఎదురుచూస్తున్నారు.
Click on Image to Read: