వయసు కోసం ఎదురుచూసి గెలిచిన ప్రేయసి!
ప్రేమించుకుని పెళ్లి చేసుకున్న ఓ జంట, ముందు విడిపోయి తరువాత అనేక కష్టనష్టాలకు ఓర్చి ఒక్కటైన సంఘటన సికిందరాబాద్‌లో చోటుచేసుకుంది. సికిందరాబాద్, వారాసీగూడాకు చెందిన మౌనిక, ఆదర్శ్ లు ప్రేమించి వివాహం చేసుకున్నారు. మౌనిక (22) బ్యూటీపార్లర్ నడుపుతుండగా, ఆదర్శ్ బీటెక్ చదువుతున్నాడు. గతేడాది ఆగస్ట్ 16వ తేదీన ఎవరికీ చెప్పకుండా యాదగిరి గుట్ట పాత నర్సింహస్వామి ఆలయంలో పెళ్లి చేసుకున్నారు. ఆ సమయం లో ఇద్దరూ కనిపించకపోవడంతో ఇరువర్గాలకు చెందిన కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. […]

ప్రేమించుకుని పెళ్లి చేసుకున్న ఓ జంట, ముందు విడిపోయి తరువాత అనేక కష్టనష్టాలకు ఓర్చి ఒక్కటైన సంఘటన సికిందరాబాద్‌లో చోటుచేసుకుంది. సికిందరాబాద్, వారాసీగూడాకు చెందిన మౌనిక, ఆదర్శ్ లు ప్రేమించి వివాహం చేసుకున్నారు. మౌనిక (22) బ్యూటీపార్లర్ నడుపుతుండగా, ఆదర్శ్ బీటెక్ చదువుతున్నాడు. గతేడాది ఆగస్ట్ 16వ తేదీన ఎవరికీ చెప్పకుండా యాదగిరి గుట్ట పాత నర్సింహస్వామి ఆలయంలో పెళ్లి చేసుకున్నారు. ఆ సమయం లో ఇద్దరూ కనిపించకపోవడంతో ఇరువర్గాలకు చెందిన కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్ కేసులు నమోదు చేశారు.
అయితే పెళ్లి చేసుకున్నాక వారిద్దరూ చిలకల గూడ పోలీసులను కలిశారు. సర్టిఫికేట్లను పరిశీలించిన పోలీసులు అబ్బాయి మైనర్ అని, మేజర్ కావడానికి మూడునెలల సమయముందని, అప్పటివరకు విడిగా ఉండమని చెప్పడంతో వారిద్దరూ ఎవరిళ్లకు వారు వెళ్లిపోయారు. మూడునెలల తరువాత మౌనిక ఆదర్శ్‌ని కలిసే ప్రయత్నం చేసింది. అయితే ఆదర్శ్ తరపు వారు అందుకు సహకరించలేదు. ఆదర్శ్ ని కలవాలని చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో మౌనిక వారం క్రితం తమ పెళ్లిఫొటోలు జతచేస్తూ తన భర్త కనబడటం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసుని నమోదు చేసి విచారించారు. ఆదివారం పోలీస్ స్టేషన్లో ఆదర్శ్‌కి అతని కుటుంబ సభ్యులకు కెన్సిలింగ్ ఇచ్చారు. పోలీసులు ఎంత చెప్పినా ఆదర్శ్ తల్లిదండ్రులు మౌనికని కోడలిగా అంగీకరించలేదు. ఆదర్శ్ మాత్రం తాను మౌనికతోనే కలిసి ఉంటానని చెప్పడంతో బస్తీ పెద్దలు ఆదివారం తిరిగి వారికి వివాహం చేశారు. దాంతో ఎట్టకేలకు ఆ ప్రేమ జంట ఒక్కటయ్యింది.
Click on Image to Read: