ఒకసారి పళ్లు ఊడాయి చాలదా..
గత ఎన్నికల్లో టీడీపీ గెలుపు కోసం కృషి చేసిన జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను టీడీపీనేత, వైసీపీ ఎమ్మెల్యే అయిన జ్యోతుల నెహ్రు లైట్‌గా తీసుకున్నారు. పార్టీలు ఫిరాయిస్తున్న విశ్వాసఘాతకుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ పవన్ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన జ్యోతుల నెహ్రు… పవన్‌కు రాజకీయ పరిణతి లేదని విమర్శించారు. పవన్ పూర్తి స్థాయి రాజకీయనాయకుడిగా వచ్చి మాట్లాడితే అప్పుడు సమాధానం చెబుతామన్నారు. గతంలో చిరంజీవి పిలవడం వల్లే పీఆర్పీలో చేరానని చెప్పారు. కాపు వ్యక్తి […]
గత ఎన్నికల్లో టీడీపీ గెలుపు కోసం కృషి చేసిన జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను టీడీపీనేత, వైసీపీ ఎమ్మెల్యే అయిన జ్యోతుల నెహ్రు లైట్‌గా తీసుకున్నారు. పార్టీలు ఫిరాయిస్తున్న విశ్వాసఘాతకుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ పవన్ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన జ్యోతుల నెహ్రు… పవన్‌కు రాజకీయ పరిణతి లేదని విమర్శించారు. పవన్ పూర్తి స్థాయి రాజకీయనాయకుడిగా వచ్చి మాట్లాడితే అప్పుడు సమాధానం చెబుతామన్నారు. గతంలో చిరంజీవి పిలవడం వల్లే పీఆర్పీలో చేరానని చెప్పారు. కాపు వ్యక్తి ముఖ్యమంత్రి అవుతారనే చిరుకు మద్దతు తెలిపానన్నారు. పవన్ పిలిస్తే 2019లో జనసేనలో చేరుతారా అని ప్రశ్నించగా ఒకసారి పళ్లు ఊడగొట్టుకున్నాం చాలదా అని అన్నారు. పీఆర్పీ పెట్టిన సమయంలోనే ఏమీ చేయలేని వ్యక్తి ఇప్పుడు కొత్తగా చేసేదేముంటుందని నెహ్రు ప్రశ్నించారు. పట్టిసీమ అనవసరం అని ఇప్పటికీ తాను భావిస్తున్నానని చెప్పారు. కార్పొరేషన్ బ్యాంకు నుంచి తాను కోట్లాది రూపాయలు అప్పు తీసుకుని తిరిగి చెల్లించని మాట నిజం కాదన్నారు. కాపుల సమస్యలపై చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉందన్నారు.
Click on Image to Read: