ఆపని కంటే ఈ పని మేలు
మహారాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీం చురకలు బార్లలో నాట్యాన్ని నిషేధిస్తూ, అలాంటి బార్లకి లైసెన్సులను ఆపుతున్న మహారాష్ట్ర ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. కోర్టు ఆదేశాలను బేఖాతరు చేసి సొంత నిర్ణయాలు తీసుకోవద్దని హెచ్చరించింది. విద్యా సంస్థలకు ఒక కిలోమీటరు దూరం వరకు నృత్యబార్లను నిషేధించడంపై కూడా సుప్రీంకోర్టు స్పందించింది. నృత్యం అనేది ఒక వృత్తి అని, అది అసభ్యంగా ఉంటే అప్పుడు చట్టపరమైన అనుమతులను రద్దుచేయవచ్చని తెలిపింది. పూర్తి నిషేధం సరికాదంది. మహిళలు రోడ్లమీద అడుక్కోవడం, […]
మహారాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీం చురకలు
బార్లలో నాట్యాన్ని నిషేధిస్తూ, అలాంటి బార్లకి లైసెన్సులను ఆపుతున్న మహారాష్ట్ర ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. కోర్టు ఆదేశాలను బేఖాతరు చేసి సొంత నిర్ణయాలు తీసుకోవద్దని హెచ్చరించింది. విద్యా సంస్థలకు ఒక కిలోమీటరు దూరం వరకు నృత్యబార్లను నిషేధించడంపై కూడా సుప్రీంకోర్టు స్పందించింది. నృత్యం అనేది ఒక వృత్తి అని, అది అసభ్యంగా ఉంటే అప్పుడు చట్టపరమైన అనుమతులను రద్దుచేయవచ్చని తెలిపింది. పూర్తి నిషేధం సరికాదంది. మహిళలు రోడ్లమీద అడుక్కోవడం, ఇతర అనుచిత పనులకు పాల్పడటం కంటే నృత్యం చేసి జీవనోపాధిని పొందటం మేలని కోర్టు పేర్కొంది. మహారాష్ట్ర అసెంబ్లీ ఈ నెల 12న బార్లలో నృత్యం అంశాన్ని క్రమబద్ధీకరించే బిల్లుని ఏకగ్రీవంగా పాస్ చేసింది. ఈ బిల్లు ప్రకారం బార్ల యజమానులపై ఒత్తిడి, నియమనిబంధనల భారం హెచ్చుగా పడుతోంది. బిల్లులో ఉన్న నిబంధనలను అతిక్రమించిన వారికి ఐదేళ్లు జైలుశిక్ష, 25వేల వరకు జరిమానా ఉంటుంది. ఇంకా బార్లను ఇళ్లమధ్య ఏర్పాటు చేయకూడదని, సెమీ రెసిడెన్షియల్ ప్రాంతాల్లో అక్కడి నివాసితుల అనుమతి ఉంటేనే ఏర్పాటు చేసుకోవచ్చని… తదితర నిబంధనలు విధించిన నేపధ్యంలో బార్ యజమానులు ఈ విషయంపై కోర్టుకి మొరపెట్టుకున్నారు.
Click on Image to Read: