ఫలించిన కులపెద్దల ఒత్తిడి
ఖమ్మం జిల్లా పాలేరు బరి నుంచి టీడీపీ తప్పుకుంది. బరిలో నామానాగేశ్వరరావును దింపాలని పార్టీ ప్రయత్నించినప్పటికీ సామాజికవర్గపరంగా వచ్చిన ఒత్తిడితో టీడీపీ వెనక్కు తగ్గిందని చెబుతున్నారు. పైకి కాంగ్రెస్ అభ్యర్థికి సహకరించాలని నిర్ణయించినట్టు టీడీపీ నేతలు చెబుతున్నా… బరి నుంచి తప్పుకోవడం వెనుక అసలు ఉద్దేశం తమ్మల నాగేశ్వరరావును గట్టెక్కించడమేనని సమాచారం. టీడీపీ పోటీ చేయాలని, బలమైన నామాను బరిలో దింపాలని రేవంత్ రెడ్డి పట్టుపట్టినా తుమ్మల సామాజికవర్గం పెద్దల ఒత్తిడికి చంద్రబాబు తలొగ్గారు. రాష్ట్ర విభజన […]
ఖమ్మం జిల్లా పాలేరు బరి నుంచి టీడీపీ తప్పుకుంది. బరిలో నామానాగేశ్వరరావును దింపాలని పార్టీ ప్రయత్నించినప్పటికీ సామాజికవర్గపరంగా వచ్చిన ఒత్తిడితో టీడీపీ వెనక్కు తగ్గిందని చెబుతున్నారు. పైకి కాంగ్రెస్ అభ్యర్థికి సహకరించాలని నిర్ణయించినట్టు టీడీపీ నేతలు చెబుతున్నా… బరి నుంచి తప్పుకోవడం వెనుక అసలు ఉద్దేశం తమ్మల నాగేశ్వరరావును గట్టెక్కించడమేనని సమాచారం. టీడీపీ పోటీ చేయాలని, బలమైన నామాను బరిలో దింపాలని రేవంత్ రెడ్డి పట్టుపట్టినా తుమ్మల సామాజికవర్గం పెద్దల ఒత్తిడికి చంద్రబాబు తలొగ్గారు.
రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో కమ్మ సామాజికవర్గం నుంచి ఏకైక మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఈయనకు రామోజీరావుతో పాటు చంద్రబాబు సన్నిహితులతో బాగా సంబంధాలున్నాయి. ఇప్పుడు తుమ్మలను కేసీఆర్ పాలేరు బరిలో దింపడంతో ఆయనను ఎలాగైనా గెలిపించుకోవాలని ఒక సామాజికవర్గం పెద్దలు నిర్ణయించుకున్నారని చెబుతున్నారు. ఒకవేళ పాలేరులో తుమ్మల ఓడిపోతే తెలంగాణ కేబినెట్‌లో సదరు సామాజికవర్గానికి దక్కిన ఒక్క బెర్త్ కూడా ఊడిపోతుంది. టీడీపీ నుంచి బరిలో దిగుతారనుకున్న నామా నాగేశ్వరరావు కూడా తుమ్మల సామాజికవర్గానికి చెందిన వారే.
కాబట్టి బలమైన నామా కూడా బరిలో దిగితే సామాజికవర్గం ఓట్లు చీలుతాయి. అప్పుడు మధ్యలో కాంగ్రెస్ అభ్యర్థికి అది కలిసి వస్తుంది. కాబట్టి టీడీపీ పోటీ చేయకపోవడం వల్ల నియోజకవర్గంలో ఉన్న 18వేల 920 ఆ సామాజికవర్గం ఓట్లు హోల్‌సేల్‌గా తుమ్మలకు పడేలా ప్లాన్ చేస్తున్నారు. ఇక్కడ లంబాడీల ఓట్లు 30 వేలు ఉన్నాయి. మాదిగలు 26 వేల మంది, మాలలు 12 వేల 276 మంది ఉన్నారు.
తుమ్మలకు టీడీపీ నుంచి ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయడంలో రెండు ప్రముఖ పత్రికల యాజమానులు, సామాజికవర్గానికి చెందిన కొందరు కీలక నాయకులు చక్రం తింపారని చెబుతున్నారు. కాంగ్రెస్‌కు సహకరించేందుకే పాలేరు బరిలో దిగలేదని టీడీపీ చెబుతున్నా… ఆపార్టీ ఓట్లన్నీ టీఆర్ఎస్‌కు మళ్లించేందుకు లోలోపల ప్రయత్నాలు జరుగుతున్నాయని చెబుతున్నాయి. అయితే తుమ్మలను శత్రువులాగా చూస్తున్న నామా నాగేశ్వరరావు అందుకు లోకల్‌లో సహకరిస్తారా అన్నది చూడాలి.
Click on Image to Read: