స్పీకర్ కు అధికారం వద్దని అప్పుడే చెప్పా...
తెలుగు రాష్ట్రాల్లో విచ్చలవిడిగా సాగుతున్న పార్టీ ఫిరాయింపులపై లోక్‌సత్తా నాయకుడు జయప్రకాశ్ నారాయణ తీవ్రంగా స్పందించారు. బడిత ఉన్న వాడితే బర్రె అన్నట్టుగా పరిస్థితి తయారైందన్నారు. అధికార పార్టీలు సొంత సామ్రాజ్యం అన్నట్టుగా రాష్ట్రాలను పాలిస్తున్నాయని అన్నారు. స్థానిక సంస్థల అధికారాలను తొక్కేసి జన్మభూమి కమిటీల పేరుతో ఓడిపోయిన వారికి అధికారం అప్పగిస్తున్నారని మండిపడ్డారు. అధికార పార్టీ సహకారం లేకుంటే ఏమీ చేయలేమన్న అభిప్రాయాన్ని కలిగిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఫిరాయింపులు నిరోధకచట్టం రావడంలో తాను కూడా […]
తెలుగు రాష్ట్రాల్లో విచ్చలవిడిగా సాగుతున్న పార్టీ ఫిరాయింపులపై లోక్‌సత్తా నాయకుడు జయప్రకాశ్ నారాయణ తీవ్రంగా స్పందించారు. బడిత ఉన్న వాడితే బర్రె అన్నట్టుగా పరిస్థితి తయారైందన్నారు. అధికార పార్టీలు సొంత సామ్రాజ్యం అన్నట్టుగా రాష్ట్రాలను పాలిస్తున్నాయని అన్నారు. స్థానిక సంస్థల అధికారాలను తొక్కేసి జన్మభూమి కమిటీల పేరుతో ఓడిపోయిన వారికి అధికారం అప్పగిస్తున్నారని మండిపడ్డారు.
అధికార పార్టీ సహకారం లేకుంటే ఏమీ చేయలేమన్న అభిప్రాయాన్ని కలిగిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఫిరాయింపులు నిరోధకచట్టం రావడంలో తాను కూడా పోరాటం చేశానని అయితే ఫిరాయించిన ఎమ్మెల్యేలపై వేటు వేసే అధికారం స్పీకర్‌కు ఇవ్వొద్దని అప్పుడే కోరామన్నారు. కానీ స్పీకర్ చేతికి అధికారం ఇవ్వడంతో అధికార పార్టీకి ఎదురులేకుండాపోతోందన్నారు.
గతంలో అధికార పార్టీ నుంచి బయటకు వెళ్లేవారని కానీ ఫిరాయింపుల చట్టంతో అధికార పార్టీ నుంచి ఫిరాయింపులు ఆగిపోయాయన్నారు. కానీ స్పీకర్ అధికార పక్షానికి చెందిన వాడే కావడంతో ప్రతిపక్షం నుంచి అధికార పక్షంలోనే ఫిరాయింపులకు అడ్డూ అదుపులేకుండా పోయిందన్నారు. స్పీకర్ కళ్ల ముందే ఫిరాయింపు డ్రామాలు నడుస్తున్నా చర్యలు తీసుకోకపోవడం దారుణమన్నారు. ఇప్పటికైనా పార్టీ మారుతున్న ఎమ్మెల్యేలపై వేటు వేసే అధికారం ఈసీకి అప్పగించాలని జేపీ డిమాండ్ చేశారు. ఈసీ సిఫార్సుతో ఫిరాయింపుదారులపై గవర్నర్ వేటు వేసేలా చట్టాన్ని తేవాలన్నారు.
Click on Image to Read: