కాసుల కోసమే కేసీఆర్ ను వాడేశారా?
గౌతమీపుత్ర శాతకర్ణి శాతవాహన రాజుల్లో గొప్పవాడు. కీ.శ 78 నుంచి 102 వరకు భారత ఉపఖండాన్ని ఏలిన తెలుగు చక్రవర్తి. ఇప్పుడు ఆయన చరిత్రను బాలయ్య తెరకెక్కిస్తున్నారు. కానీ ఈ సినిమా ప్రారంభానికి ముందే ఒక ప్రచారం జరిగిపోయింది. ఉప ఖండాన్ని ఏలిన శాతకర్ణను అమరావతికి పరిమితం చేసేశారు. అమరావతిని ఏలిన రాజు గౌతమీపుత్ర శాతకర్ణ అని అందుకే ఆయన జీవితాన్ని బాలయ్య 100 వ చిత్రంగా తెరకెక్కిస్తున్నారని మీడియాలో ప్రచారం జరిగింది. చరిత్రతో సంబంధం లేకుండానే చిత్ర యూనిట్ […]
గౌతమీపుత్ర శాతకర్ణి శాతవాహన రాజుల్లో గొప్పవాడు. కీ.శ 78 నుంచి 102 వరకు భారత ఉపఖండాన్ని ఏలిన తెలుగు చక్రవర్తి. ఇప్పుడు ఆయన చరిత్రను బాలయ్య తెరకెక్కిస్తున్నారు. కానీ ఈ సినిమా ప్రారంభానికి ముందే ఒక ప్రచారం జరిగిపోయింది. ఉప ఖండాన్ని ఏలిన శాతకర్ణను అమరావతికి పరిమితం చేసేశారు. అమరావతిని ఏలిన రాజు గౌతమీపుత్ర శాతకర్ణ అని అందుకే ఆయన జీవితాన్ని బాలయ్య 100 వ చిత్రంగా తెరకెక్కిస్తున్నారని మీడియాలో ప్రచారం జరిగింది. చరిత్రతో సంబంధం లేకుండానే చిత్ర యూనిట్ మాటలు బాగా జనంలోకి వెళ్లిపోయాయి. ఒకవిధంగా గౌతమీపుత్ర సినిమా అమరావతి కథ అన్నట్టు ప్రచారం జరగడంతో తెలంగాణ, ఇతర ప్రాంతాల జనంలో గౌతమీపుత్ర సినిమాపై ఆసక్తి తగ్గిపోయింది. అదేదో అమరావతి గొప్పదనం చాటేందుకు బాలయ్య చేస్తున్న ప్రయత్నం కాబోలు అన్న భావన సాధారణ జనంలో కలిగింది. ఇక్కడే బాలయ్య, ఆయన చిత్ర బృందం ఉలిక్కిపడిందని చెబుతున్నారు.
భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న సినిమా ఒక ప్రాంతానికే సంబంధించిందన్న భావన తెలుగు ప్రజల్లోనే వస్తే కమర్షియల్‌గా దానిపై ప్రమాదకరమైన ప్రభావం ఉంటుంది. ఆ సినిమాను తెలంగాణ ప్రజలు ఓన్ చేసుకోకపోతే బాలయ్య 100 సినిమాకు దెబ్బపడడం ఖాయం. అందుకే అప్పటి వరకు అమరావతి రాజు కథ అంటూ సాగిన ప్రచారానికి బాలయ్య బృందం తెలివిగానే మందు కనిపెట్టిందని చెబుతున్నారు. తెలంగాణలో విపరీతమైన క్రేజ్ ఉన్న కేసీఆర్‌ను సినిమా షూటింగ్ ప్రారంభోత్సవ పూజా కార్యక్రమానికి ఆహ్వానించడమే ఆ తెలివైన ఎత్తుగడ.
అనుకున్నట్టుగానే కేసీఆర్ కార్యక్రమానికి హాజరయ్యారు. బాలయ్యను , ఆయన తండ్రి ఎన్టీఆర్‌ను పొగిడేశారు. గౌతమీ పుత్ర శాతకర్ణి కథతో తన వందో సినిమా తీయాలని బాలకృష్ణ తీసుకున్న నిర్ణయం గొప్పదని అన్నారు. బాలకృష్ణకు ఈ చిత్రం విజయవంతం కావాలని తాను దీవెనలు అందిస్తున్నానని చెప్పారు. ఈ వందో సినిమా 200 రోజులు ఆడుతుందని చెప్పారు. కేసీఆర్ కార్యక్రమానికి వచ్చి ఆయన చెప్పిన మాటల తర్వాత గౌతమీపుత్ర శాతకర్ణి అనేది అమరావతి ప్రాంతానికి సంబంధించిందే అని తొలుత స్వయంగా చేసుకున్న ప్రచారం నుంచి కొద్దిమేరనైనా బయటపడవచ్చని బాలయ్య మూవీ పెద్దలు భావిస్తున్నారు.
గౌతమీపుత్ర సినిమా తెలంగాణ ప్రజలు కూడా చూడదగ్గదే అన్న భావన ఇప్పుడు ఏర్పడిందని చిత్రయూనిట్ చెబుతోంది. మొత్తం మీద కార్యక్రమానికి కేసీఆర్‌ను ఆహ్వానించడం వెనుక తెలంగాణ ప్రాంతంలో బాలయ్య సినిమాకు దెబ్బపడకుండా ఉండడం అనే పెద్ద కారణం ఉందని చెబుతున్నారు. అయినా గౌతమీపుత్ర శాతకర్ణి లాంటి చక్రవర్తిని ఒక ప్రాంతానికి పరిమితం చేసేలా ప్రచారం చేయడం ఎందుకు… ఇప్పుడు ఇలా కాకాలు పట్టడం ఎందుకు?. అయినా ఈ కార్యక్రమానికి హాజరవడం వల్ల కేసీఆర్‌కు ఓటు బ్యాంకు పరంగా అంతో ఇంతో ఉపయోగమే ఉంటుంది.
Click on Image to Read: