సుజయ్‌కృష్ణ ఇంటికి వెళ్లడానికి ముందే చెప్పా...
తెలుగు రాష్ట్రాల్లో నడుస్తున్న రాజకీయాలపై వైసీపీ నేత బొత్స తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ నాయకులంటే జనంలో అసహ్యం కలిగేలా రాజకీయాలు చేస్తున్నారని ఒక టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు. తానుచాలా కాలం అసెంబ్లీలో ఉన్నానని కానీ ఇప్పుడు అసెంబ్లీలో నియమాలు, నిబంధనలు ఉన్నాయంటే ఎవరూ నమ్మడం లేదన్నారు. చాలా దౌర్బాగ్యకరంగా సభ నడుస్తోందన్నారు. వైసీపీలో చీలిక తెచ్చి జ్యోతుల నెహ్రును ఆ గ్రూప్‌కు నాయకుడిగా చేస్తామని టీడీపీ నేతలు చెప్పడంపై బొత్స తీవ్రంగా […]
తెలుగు రాష్ట్రాల్లో నడుస్తున్న రాజకీయాలపై వైసీపీ నేత బొత్స తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ నాయకులంటే జనంలో అసహ్యం కలిగేలా రాజకీయాలు చేస్తున్నారని ఒక టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు. తానుచాలా కాలం అసెంబ్లీలో ఉన్నానని కానీ ఇప్పుడు అసెంబ్లీలో నియమాలు, నిబంధనలు ఉన్నాయంటే ఎవరూ నమ్మడం లేదన్నారు. చాలా దౌర్బాగ్యకరంగా సభ నడుస్తోందన్నారు. వైసీపీలో చీలిక తెచ్చి జ్యోతుల నెహ్రును ఆ గ్రూప్‌కు నాయకుడిగా చేస్తామని టీడీపీ నేతలు చెప్పడంపై బొత్స తీవ్రంగా స్పందించారు. యనమల రామకృష్ణుడు అహంకారంతో మాట్లాడుతున్నారని అన్నారు. ఒకప్పుడు స్పీకర్‌గా పనిచేసిన వ్యక్తి ఇలాంటి మాటలు మాట్లాడడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.
పార్టీ వీడిన ఎమ్మెల్యేలు జగన్‌పై విమర్శలు చేయడాన్ని బొత్స తప్పుపట్టారు. ప్రతి ఎమ్మెల్యే కూడా పార్టీ వీడడానికి నాలుగైదు రోజుల ముందు జగన్‌ను పొగిడిన వారేనని గుర్తు చేశారు. నాలుగు రోజుల క్రితం పొగిడిన నేతలు ఇప్పుడు విమర్శలు చేస్తున్నారంటే వారి మాటలకు ఎంత విలువ ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. పార్టీ వీడుతున్న ఎమ్మెల్యేలకు వ్యక్తిగత ఎజెండాలు ఉన్నాయని కాబట్టి వారిని ఆపడం ఎవరి వల్ల కాదన్నారు. సొంత పార్టీ ఎమ్మెల్యేలకు డబ్బులు ఇచ్చి పార్టీలో నిలుపుకోవడాలంటే అయ్యేపని కాదన్నారు.
సుజయ్ కృష్ణ రంగారావు పార్టీ వీడడంపైనా స్పందించారు. ఆయన పార్టీ ఎందుకు వీడారో అందరికీ తెలుసన్నారు. సొంత జిల్లాకే చెందిన ఎమ్మెల్యే పార్టీ వీడుతుంటే మీరు చర్చలు జరపవచ్చు కదా అని ప్రశ్నించగా… స్థానికుడిగా వారి సంగతి తనకు బాగా తెలుసన్నారు. సుజయ్ కృష్ణతో చర్చలు జరిపేందుకు విజయసాయిరెడ్డి, చెవిరెడ్డి వెళ్లేందుకు సిద్ధమైనప్పుడు వారి గురించి చెప్పాన్నారు. వెళ్లినా ప్రయోజనం ఉండదని… కనీసం కలిసేందుకు కూడా వారు అవకాశం ఇవ్వరని చెప్పానని అదే జరిగిందన్నారు. సిద్ధాంతాల కోసం పార్టీ మారే వారితో చర్చలు జరపవచ్చు కానీ వ్యక్తిగత ప్రయోజనాల కోసం పార్టీ వీడే వారిని బుజ్జగించడం అనవసరమన్నారు.
రాష్ట్రంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అందుకే జనం దృష్టి మళ్లించేందుకు చంద్రబాబు ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారని బొత్స అన్నారు. నిర్మాణాలు పూర్తి కాకముందే నాలుగు గోడల మధ్య సచివాలయం ప్రారంభోత్సవం అంటే ఈ ప్రభుత్వం చేస్తున్న చర్యలను ఏమనాలో అర్థం కావడం లేదన్నారు. తెలంగాణలో ఎమ్మెల్యేలు టీడీపీని వీడివెళ్తే సిగ్గులేదా లజ్జ లేదా అని మాట్లాడిన చంద్రబాబు ఏపీకి వచ్చేసరికి రెండు కళ్ల సిద్దాంతాన్ని అమలు చేస్తున్నారని బొత్స ఎద్దేవా చేశారు.
Click on Image to Read: