మరో వివాదంలో ఫిరాయింపు ఎమ్మెల్యే జలీల్ ఖాన్
వైసీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయించిన విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్‌కు అధికార పార్టీ నీరు తగిలేసరికి రెచ్చిపోతున్నారు. పార్టీ మారిన తర్వాత ఇప్పటికే మూడుసార్లు విలేకర్లపై దాడి చేసిన జలీల్ ఖాన్ తాజాగా మరోసారి అదేపనిచేశారు. తోటి ముస్లింలను పచ్చిబూతులు తిట్టారు ఎమ్మెల్యే. తారాపేటలోని జలీల్‌ఖాన్ ఆఫీస్ సమీపంలోని ప్రధాన రహదారిని విస్తరించాలని ఇటీవల అధికారులు నిర్ణయించారు. రోడ్డు విస్తరణలో మసీదుతో పాటు ముస్లిం శ్మశానవాటిక చాలా భాగం నష్టపోనుంది. ఈ నేపథ్యంలో గోరీలదొడ్డి కమిటీ, స్థానిక […]
వైసీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయించిన విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్‌కు అధికార పార్టీ నీరు తగిలేసరికి రెచ్చిపోతున్నారు. పార్టీ మారిన తర్వాత ఇప్పటికే మూడుసార్లు విలేకర్లపై దాడి చేసిన జలీల్ ఖాన్ తాజాగా మరోసారి అదేపనిచేశారు. తోటి ముస్లింలను పచ్చిబూతులు తిట్టారు ఎమ్మెల్యే.
తారాపేటలోని జలీల్‌ఖాన్ ఆఫీస్ సమీపంలోని ప్రధాన రహదారిని విస్తరించాలని ఇటీవల అధికారులు నిర్ణయించారు. రోడ్డు విస్తరణలో మసీదుతో పాటు ముస్లిం శ్మశానవాటిక చాలా భాగం నష్టపోనుంది. ఈ నేపథ్యంలో గోరీలదొడ్డి కమిటీ, స్థానిక ముస్లిం ప్రముఖులు గోరీలదొడ్డి వద్ద రాత్రి సమావేశమయ్యారు. ఈ విషయం తెలుసుకున్న జలీల్ ఖాన్ ఆగ్రహంతో ఊగిపోతూ అక్కడికి చేరుకున్నారు. తనకు చెప్పకుండా సమావేశం పెట్టుకోవడమేమిటంటూ అందరినీ పచ్చి బూతులు తిట్టారు.
ఇంతలో అటుగా వెళ్తున్న కాకతీయ పత్రిక సంపాదకుడు షఫీ గొడవను గమనించి అక్కడికి వెళ్లారు. ఎమ్మెల్యే ఊగిపోతుండగా ఫొటోలు తీశారు. అంతే ఎమ్మెల్యే కోపం సంపాదకుడిపైకి మళ్లింది. ‘ఎవడ్రా ఫొటోలు తీస్తోంది.. వాడిని కుమ్మండ్రా’ అంటూ తన అనుచరులను ఆదేశించారు. అంతే జలీల్ ఖాన్ అనుచరులంతా కలిసి సదరు పత్రిక సంపాదకుడిని తీవ్రంగా కొట్టారు. సెల్‌ఫోన్‌ను పగులగొట్టారు. ఫొటోలను డిలేట్ చేశారు. ఎమ్మెల్యేతో మాట్లాడేందుకు షఫీ ప్రయత్నించగా… ఎక్కువ మాట్లాడవద్దు… జైలులో పెట్టిస్తా… బెయిల్ కూడా రాదు అంటూ పోలీస్, కోర్టు అన్నీ తానే అన్నట్టుగా వార్నింగ్ ఇచ్చారు. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ పోలీసులు యాక్షన్ తీసుకుంటారన్న ఆశ మాత్రం కనిపించడం లేదు.
Click on Image to Read: