పార్టీ మారడం వ్యభిచారమే… అలా చేస్తే బలుపు మాత్రమే పెరుగుతుంది
ఆంధ్రప్రదేశ్‌లో విచ్చలవిడిగా సాగుతున్న పార్టీ ఫిరాయింపులపై బీజేపీ శాసనసభపక్ష నేత విష్ణుకుమార్ రాజు తీవ్రంగా స్పందించారు. పార్టీలు ఫిరాయించడం వ్యభిచారంతో సమానమన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఏ ముఖం పెట్టుకుని తిరిగి జనం వద్దకు వెళ్తారని ప్రశ్నించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు వెంటనే రాజీనామా చేయాలన్నారు. తిరిగి ఎన్నికలకు వెళ్లి ప్రజా తీర్పు కోరాలన్నారు. ఇప్పటికే రాజకీయాలంటే జనం చీదరించుకుంటున్నారని… ఈ సమయంలో ఫిరాయింపుల వల్ల ఉన్న పరువు కూడా పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలు […]

ఆంధ్రప్రదేశ్‌లో విచ్చలవిడిగా సాగుతున్న పార్టీ ఫిరాయింపులపై బీజేపీ శాసనసభపక్ష నేత విష్ణుకుమార్ రాజు తీవ్రంగా స్పందించారు. పార్టీలు ఫిరాయించడం వ్యభిచారంతో సమానమన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఏ ముఖం పెట్టుకుని తిరిగి జనం వద్దకు వెళ్తారని ప్రశ్నించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు వెంటనే రాజీనామా చేయాలన్నారు. తిరిగి ఎన్నికలకు వెళ్లి ప్రజా తీర్పు కోరాలన్నారు. ఇప్పటికే రాజకీయాలంటే జనం చీదరించుకుంటున్నారని… ఈ సమయంలో ఫిరాయింపుల వల్ల ఉన్న పరువు కూడా పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలు పార్టీ మారితే బలం పెరగదని… బలుపు మాత్రమే పెరుగుతుందని విష్ణుకుమార్ రాజు అన్నారు. విశాఖలో విష్ణుకుమార్ రాజు ఈ వ్యాఖ్యలు చేశారు.
Click on Image to Read: