నల్లగా ఉన్నావ్...ఆత్మహత్య చేసుకో!
భార్య నల్లగా ఉందని ఆమెను చంపే ప్రయత్నం చేశాడో ప్రబుద్ధుడు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో నివాసం ఉంటున్న ప్రభు, లక్ష్మి జంటకు మూడేళ్ల క్రితం వివాహమైంది. పెళ్లయినప్పటినుండే నువ్వు నల్లగా ఉన్నావంటూ… ప్రభు భార్యని వేధించేవాడు. ఆత్మహత్య చేసుకోమంటూ ఆమెపై ఒత్తిడి తెచ్చేవాడు. ఈ క్రమంలో తన సోదరుడు యల్లయ్యతో కలిసి గత మంగళవారం లక్ష్మిని హత్యచేసే ప్రయత్నం చేశాడు. పోలీసులు వారిద్దరినీ గురువారం అరెస్టు చేశారు. ప్రభు, లక్ష్మీ ఇద్దరూ కూలిపనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. భర్త […]
భార్య నల్లగా ఉందని ఆమెను చంపే ప్రయత్నం చేశాడో ప్రబుద్ధుడు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో నివాసం ఉంటున్న ప్రభు, లక్ష్మి జంటకు మూడేళ్ల క్రితం వివాహమైంది. పెళ్లయినప్పటినుండే నువ్వు నల్లగా ఉన్నావంటూ… ప్రభు భార్యని వేధించేవాడు. ఆత్మహత్య చేసుకోమంటూ ఆమెపై ఒత్తిడి తెచ్చేవాడు. ఈ క్రమంలో తన సోదరుడు యల్లయ్యతో కలిసి గత మంగళవారం లక్ష్మిని హత్యచేసే ప్రయత్నం చేశాడు. పోలీసులు వారిద్దరినీ గురువారం అరెస్టు చేశారు.
ప్రభు, లక్ష్మీ ఇద్దరూ కూలిపనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. భర్త నల్లగా ఉన్నావంటూ వేధిస్తుండటంతో లక్ష్మి మహిళా పోలీస్ స్టేషన్లో పలుమార్లు ఫిర్యాదు చేసింది. అతనికి తాము కౌన్సెలింగ్ చేశామని, ఆ సమయంలో మాత్రం మారతానని చెప్పేవాడని, తిరిగి యథాప్రకారం ప్రవర్తించేవాడని పోలీసులు చెబుతున్నారు. ఎవరెన్ని చెప్పినా ప్రభు తీరులో మార్పు రాలేదు. చివరికి హత్యచేయాలనే నిర్ణయానికి వచ్చాడు. మంగళవారం ప్రభు తన సోదరుడు యల్లయ్యతో కలిసి ఒక్కసారిగా లక్ష్మిమీద దాడికి దిగాడు. యల్లయ్య బయట కాపలా ఉండగా ప్రభు లక్ష్మి గొంతు నులిమి చంపబోయాడు. లక్ష్మి గట్టిగా అరవడంతో చుట్టుపక్కలవారు వచ్చి ఆమెను కాపాడారు. పోలీసులు అన్నదమ్ములను అరెస్టు చేశారు.